తెలుగు లో వస్తున్న బిగ్ బాస్3  పూర్తికావొస్తుంది. మరికొన్ని రోజుల్లో విజేత ఎవరో తెలిసిపోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఐదుగురు కంటిస్టెంట్స్ మాత్రమే ఉన్న విషయం తెలిసిందే.  వరుణ్ సందేశ్, శ్రీముఖి,రాహుల్,బాబా భాస్కర్, అలీ రెజా.  అయితే మొన్న ఆదివారం వరకు శివజ్యోతి, అలీ రెజా ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఉంటారని సస్పెన్స్ కొనసాగింది.  అనూహ్యంగా శివజ్యోతి ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  


ప్రస్తుతం బిగ్ బాస్ 3 హౌజ్ లో ప్రముఖ యాంకర్ సుమ సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులతో సుమ భలే నవ్వులు పూయించారు.  ఇక బిగ్ బాస్3 విన్నర్ ఎవరో చెప్పేస్తుంది నటి వితిక.  గత వారం వరకు వితిక బిగ్ బాస్ హౌజ్ లోనే గడిపారు. వరుణ్ సందేశ్-వితిక భార్యభర్తలు గా మొదటి సారి బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.  మొన్నటి వరకు గట్టి పోటీ ఇచ్చిన వితిక పోయిన వారం ఎలిమినేట్ అయ్యింది.  తాజాగా బిగ్ బాస్ విన్నర్ తన భర్త వరుణ్ సందేశ్ అని బల్లా గుద్ది మరీ చెబుతుంది. బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చినా, తనకంటే వరుణ్ ఎంతో బాగా ఆడాడని వ్యాఖ్యానించింది. 

వరుణ్ సోలోగా ఉంటే మరింత బాగా ఆడతాడని తాను బయటకు వచ్చిన తరువాత చాలా మంది చెప్పారని, అందువల్ల తాను ఎలిమినేట్ అయినందుకు బాధపడటం లేదని అన్నారు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో తాను ఉన్నపుడు కిచెన్ సామ్రాజ్యానికి తానే రాణి అని చెప్పుకొచ్చింది. ఫైనల్ లో వరుణ్ గెలిస్తే.. విన్నర్ ప్రైజ్ రూ. 50 లక్షలను భద్రంగా దాచుకుంటామని చెప్పింది.

తమ వివాహం జరిగిన చాలా కాలం పాటు ఎన్నో కష్టాలు పడ్డామని వితిక తెలిపింది. ఇప్పుడు డబ్బులు వస్తే.. దాన్ని ఫిక్సెడ్ చేసుకుంటామని వ్యాఖ్యానించింది. అయితే వరుణ్ సందేశ్ కి బిగ్ బాస్ హౌజ్ లో గట్టి పోటీ ఇచ్చేది మాత్రం శ్రీముఖి,రాహుల్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: