దీపావళి పండుగ రోజు కొత్త సినిమాల పోస్టర్స్ చాలానే వచ్చి హల్ చల్ చేశాయి. మూవీ లవర్స్ కి అయితే ఈ దీపావళి కన్నుల పండుగ అనే చెప్పవచ్చు. తమ అభిమాన నటుడి పోస్టర్ల తో దీపావళి కాస్తా వెలుగులు జిమ్మింది. అందులో రానా హీరోగా నటించిన చారిత్రక కథ "1945" అనే చిత్రం చాలా కాలంగా నాన్చుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ తో పాటు చిత్రం విడుదల తేదీని కూడా వదిలారు. నిజానికి ఈ చిత్రం 2017 లోనే ప్రారంభం అయ్యింది. కాకపోతే నిర్మాతతో పారితోషకం విషయంలో సెట్ కాలేదని అప్పట్లో టాక్. 

పోస్టర్ విదులైన తరవాత ఆ చిత్ర నిర్మాత రాజరాజన్ పై రానా ట్విట్టర్ ద్వారా స్పదించారు. ఆయన ట్విట్ లో "డబ్బు రాబట్టుకోవడం కోసమే పూర్తి కాని సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మార్కెట్ ని మోసం చేస్తున్నారు. ఎవరూ నమ్మొద్దు" అంటూ పేర్కొన్నారు. ఇంకా "ఏడాది దాటింది ఈ నిర్మాతలను కలిసి. పారితోషికాలే తేలలేదు" అని నిర్మాత పై వివాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ ఈ ట్విట్ ని వెంటనే తొలగించేశారు రానా. అసలు ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాక ముందే మూవీ రిలీజ్ చేస్తున్నారు అంటూ రానా అంటున్నారు. అయితే చిత్ర నిర్మాత రాజరాజన్ కూడా రానా ట్వీట్ కి గట్టిగానే రిప్లయ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయమే సామాజక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

రాజరాజన్ తన ట్విట్టర్ ద్వారా "సినిమా పూర్తయ్యిందా.. లేదా? అనేది డైరెక్టర్ మాత్రమే నిర్ణయిస్తాడు. 60 రోజుల పాటు షూటింగ్ చేసి కోట్లాది రూపాయలు పోసాం. పూర్తి కాకుండానే సినిమాని ఎవరూ రిలీజ్ చేయరు" అంటూ స్పందించారు. మరి ఈ టాపిక్ ఎక్కడదాక వెళ్తుందో. రానా హీరోగా 1945 అనే ఈ చిత్రం కె.ప్రొడక్షన్స్ సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి సత్య శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాత్రంత్రం ముందు జరిగే కథను తెరపై చూపించబోతున్నారు. అలాగే సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో ఉండే వీర సైనికుడిగా రానా పాత్ర ఉండబోతుంది. అయితే హీరో, నిర్మాత మధ్య జరిగే వివాదం సద్దుమునిగి మూవీ సకాలంలో రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: