మెగా తనయుడు రామ్ చరణ్ గా మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడా? చెర్రీగా చిరు కనిపించడమేంటి అనుకుంటున్నారా..? కొరటాల శివతో మెగాస్టార్ చేస్తున్న కొత్త సినిమాలో ఇదే మ్యాజిక్ ఉండబోతోందని వినిపిస్తోంది.


మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డితో మరోసారి తన స్టామినా నిరూపించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సునాయాసంగా 100కోట్లకు పైగా వసూళ్లు మెగాస్టార్ సత్తా ఏంటో చూపించింది. ఇతర లాంగ్వేజస్ లో వెనుకబడినా కూడా తెలుగు వర్షన్ సాధించిన వసూళ్లు నిర్మాత రామ్ చరణ్ కు సంతృప్తి మిగిల్చాయి. అయితే ఇపుడు చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న సినిమాకు సంబంధించిన చిరు క్యారెక్టర్ పై సర్ ప్రైజింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 


దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ ను ఎలా చూపించబోతున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. మొదట ఈ చిత్రంలో చిరంజీవి డబుల్ రోల్ చేస్తున్నట్టు వినిపించింది. ఆ తర్వాత ఈ చిత్రంలో చిరంజీవితో పాటు చరణ్ కూడా నటించబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇపుడు మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. కొరటాల శివ, చిరంజీవి సినిమాలో చరణ్ నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. 


చిరంజీవి యంగ్  ఏజ్ క్యారెక్టర్ లో రామ్ చరణ్ నక్సలైట్ గా కనిపించనున్నట్టు సమాచారం. అందుకే  చిరు యంగ్ ఏజ్ పాత్రను చరణ్ తో చేయించాలని కొరటాల భావిస్తున్నాడట. ఇదే కనుక నిజం అయితే మెగాఫ్యాన్స్ తో పాటు సినీప్రియులకు డబుల్ బొనాంజా అని చెప్పాలి. ఇది గాసిప్సా లేక నిజమా అనేది నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ నుంచి అఫిషియల్ స్టేట్ మెంట్ ఇస్తే క్లారిటీ వస్తుంది.
 అన్నీ అనుకున్నట్టుగా... ఊహించింది జరిగితే మెగా ఫ్యాన్స్ కు నిజమైన పండుగ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: