వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే గుర్తొచ్చే మాట వివాదం.. ఎవరొకరి మీద నోరు పారేసుకోవడం మాత్రమే వర్మకు తెలుసు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అయిందానికి కానీ దాని నోరు పారేసుకోవడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య.. వర్మ  అనేది ఒక పెరు కాదు బ్రాండ్.. అంటూ ఆయన ఫ్యాన్స్ కొందరు అనడం జోక్ వేయకుండానే నవ్వును తెప్పిస్తుంది..


ఈ మధ్య వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించారు. బాలయ్య తీసిన సినిమాలు సరిగా లేవంటూ నేను నిజాలను బయటపెడతాను అంటూ ఈ సినిమాను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎన్నికల ముందు టీడీపీ నేతలకు ఈ సినిమాను చూపించాడు కారం లేకుండానే మంటను కలిగించాడు. అలాగే మా ఓట్లకు గండికొట్టారు అంటూ కోర్టు మెట్లు కూడా ఎక్కాడు.. కోతి పుండు బ్రహ్మాండం అనే మాటకు వర్మ కరెక్టుగా సూటవుతారాని నెటిజన్లు కూడా ఆయనపై మాటల వర్షం కురిపిస్తున్నారు..


నా రూట్ సపరేటు అనేలా వర్మ ఆ మాటలు పెడచెవిన పెట్టి మరో సినిమాను దించే ప్రయత్నం చేస్తున్నాడు.. ఆ సినిమానే కమ్మరాజ్యంలో కడపరెడ్లు.. ఈ సినిమా ట్రైలర్ మొన్న ఆదివారం విడుదల అయింది. వ్యూస్ మంచిగా వెళ్తున్నాయని ఆనందపడాలో.. విమర్శలు లేపుతుందని భాదపడాలో అర్థకాకుండా పోయింది..ఇక పోతే ఈ సినిమాలో జగన్ ని హైలెట్ చేస్తూ మిగితా పార్టీలను హేళన చేస్తున్నారనే వార్తలను వర్మ మూట కట్టుకున్నారు.. ఓ సందర్భంలో లోకేష్ పప్పు అనే మాట వినపడుతోంది..


ఈ మాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది..కేవలం ట్రైలర్ కె విమర్శలు రావడంతో కాలిన వర్మ ఆ విషయంపై స్పందించాడు.. నిజంగా లోకేష్ ను పప్పు అంటారా నాకు ఈ విషయం మీరు చెబితేనే తెలిసింది.. అంటూ వర్మ వ్యంగ్యంగా మాట్లాడాడు. దానితో వర్మపై , వర్మ సినిమాపై కేసులు కూడా నడుస్తున్నాయి.. వర్మ మాత్రం ఆరు నూరైనా నూరు ఆరైనా కూడా నేను ఈ సినిమాను వదలను ఏ మాత్రం మార్చను అంటూ మొండికేసి కూర్చున్నాడు..నా సినిమా నా ఇష్టం చూస్తే చూడు లేకపోతే లేదు అంటూ వర్మ ప్రవర్తిస్తున్నాడు.. ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: