బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కు వచ్చేసింది.. 100 రోజులుగా కంటెస్టంట్స్ అందరు తమ బెస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో ఒకరు మాత్రమే విజేత అవుతారు. అయితే టాప్ 5లో ఉన్న రాహుల్, శ్రీముఖి, వరున్, బాబా భాస్కర్, అలి రెజాలలో ఇద్దరి మధ్య మాత్రం టైటిల్ పోటీ రసవత్తరంగా సాగుతుంది, 


సోషల్ మీడియా రిపోర్ట్ ప్రకారం చూస్తే రాహుల్ సిప్లిగంజ్ వర్సెస్ శ్రీముఖి ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. సింగర్ గా రాహుల్ కు సోషల్ మీడియాలో భారీ సపోర్ట్ ఉంది. అతను సింగర్ గానే కాదు ప్రైవేట్ ఆల్బం తో కూడా బాఅ పాపులర్ అయ్యాడు. అందుకే రాహుల్ కు ఎక్కువ ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. అదీగాక హౌస్ లో మొదట్లో కొద్దిగా అటు ఇటుగా ఉన్న రాహుల్ రాను రాను తోటి కంటెస్టంట్స్ కు టఫ్ ఫైట్ ఇస్తూ వచ్చాడు.    


ఇక శ్రీముఖి కూడా డే 1 నుండి ఇప్పటివరకు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తుంది. టాస్కుల్లో కూడా తన వరకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతుంది. అయితే వీరితో పాటుగా వరుణ్ సందేష్ కూడా టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది. హీరోగా ప్రేక్షకులను కొన్నాళ్లు అలరించిన వరుణ్ సందేష్ బిగ్ బాస్ హౌజ్ లోకి తన భర్యతో కలిసి వచ్చాడు. తన గేం తాను ఆడుతూ ఇంట్లో అందరి చేత మంచి వాడుగా పేరు తెచ్చుకున్నాడు వరుణ్. 


అయితే టాప్ 2లో మాత్రం రాహుల్, శ్రీముఖి ఉన్నారని తెలుస్తుంది. ఇద్దరి మధ్యనే టైటిల్ విన్నర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ 3 ఫైనల్ విన్నర్ ను ఎనౌన్స్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తున్నాడని సమాచారం. మరి బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ ఎవరన్నది తెలియాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.   



మరింత సమాచారం తెలుసుకోండి: