సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కంటే.. సక్సెస్ కే  స్టార్ డమ్ ఎక్కువ. హీరో హీరోయిన్ అయినా, కమెడియన్ అయినా  హిట్ ఉంటేనే వాళ్ళకంటూ ఒక  వాల్యూ..! లేకపోతే వాళ్ళని సినిమా వాళ్ళతో పాటు  ఆడియన్స్ కూడా పట్టించుకోరు. అందుకే ఇండస్ట్రీలో  ప్రతి ఒక్కరూ హిట్ గురించే ఆలోచిస్తారు. అందులో హీరోలు అయితే మరీనూ..!  ఒకప్పుడు హిట్లు అందుకుని.. చాలా కాలం నుంచి హిట్  కోసం ఫైట్ చేస్తూ.. హిట్ కొట్టలేక.. బాక్సాఫీస్ వద్ద  పడిగాపులు కాస్తోన్న హీరోలు టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు. రవితేజ, గోపీచంద్, నితిన్, రాజ్ కిరణ్, సందీప్ కిషన్,  అఖిల్, నారా రోహిత్, సాయి ధరమ్ తేజ్, అల్లరి నరేష్ ఇలా చెప్పుకుంటూ పోతే.. లిస్ట్ పెద్దదే వస్తోంది. ఇప్పుడు వీరందరి కెరీర్ ఒక హిట్ తప్పనిసరి. 

రవితేజ గురించి చెప్పుకుంటే  మధ్యలో 'రాజా ది గ్రేట్' తప్ప ఆ సినిమాకి ముందు చేసిన బెంగాల్ టైగర్, కిక్ 2,  సినిమాలు కావొచ్చు , ఆ  సినిమా  తరువాత చేసిన  సుప్రీమ్’ త‌ర్వాత చేసిన 'తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు' ఇలా  సినిమాలన్నీ భారీ డిజాస్టర్‌లే.  ‘చిత్రల‌హరి’ మాత్రం జస్ట్ పర్వాలేదు అనిపించుకుంది.  ఇక ప్రముఖంగా చెప్పుకోవాల్సిన మరో  పేరు 'అల్లరి నరేష్'.  ఎప్పుడో 2012లో చేసిన ‘సుడిగాడు’ అనే పేరడీ సినిమా తర్వాత  అల్లరి నరేష్ చేసిన  సినిమాలన్నీ అత్యంత భారీ డిజాస్టర్‌లే. ఒక్కప్పుడు తోటి హీరోలు అసూయ పడేలా వరుసగా హిట్స్ మీద హిట్స్ కొట్టిన అల్లరోడు.. ప్రస్తుతం  హిట్ కోసం  పాపం  ఫైట్  చే..స్తూ..నే  ఉన్నాడు.    

ఇక 'గుండెజారి గల్లంతయ్యిందే' అనే సినిమాకి ముందు వరకు టాలీవుడ్ లో ప్లాప్ హీరోకి పర్యాయ పదంగా మారిపోయిన నితిన్.. ఎట్టకేలకూ ఆ ప్లాప్ ల వలయంలో నుంచి బయటపడ్డాడు. మళ్లీ మినిమమ్ గ్యారింటీ హీరోగా చలామణి అవుతున్న టైంలో..  ‘లై’, ‘చల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’లాంటి ప్లాప్ లతో మళ్లీ  నితిన్ డీలా పడ్డాడు. అక్కినేని యంగ్ హీరో అఖిల్ చేసిన మూడు సినిమాలు అఖిల్ కి స్టార్ డమ్ ని తెచ్చి పెట్టలేకపోయాయి. ఆలాగే  యాక్షన్ హీరో గోపీచంద్‌ కి ఈ మధ్య  ప్లాప్ లు తప్ప  హిట్లు అస్సలు రాను అంటున్నాయి. అప్పుడెప్పుడో చేసిన  ‘లౌక్యం’ సినిమా  తప్ప.. ఈ మధ్యకాలంలో గోపీచంద్ కి సరైన  హిట్ రాలేదు. పాపం హిట్ డీలా పడ్డ తెలుగు హీరోలు.  


మరింత సమాచారం తెలుసుకోండి: