ఒకే రోజు మూడు సినిమాలు రావడం టాలీవుడ్ కి కొత్త కాకపోయినా మారిన పరిస్థితుల్లో, అవాంచనీయమైన పోటీ వద్దు అనుకుంటున్న టైంలో దాన్ని బేఖాతర్ చేస్తూ మూడు సినిమాలు వచ్చేస్తున్నాయి. ఎవరి లెక్కలు లక్కులు వారికి ఉన్నాయి. కానీ ఇక్కడ మూడు సినిమాలను ఆ సీజన్ భరించగలదా అన్నది ఒక పెద్ద డౌట్. పైగా ముగ్గురు హీరోల కెరీర్, గ్రాఫ్ చూసుకుంటే హిట్టు ఎవరు కొడతారు అన్నది పెద్ద  చర్చగా ఉంది.


అది డిసెంబర్ 20వ తేదీ. అంటే మరో యాభై రోజుల తరువాత అన్న మాట. క్రిస్మస్ ని టార్గెట్ చేస్తూ మూడు సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికి చూసుకుంటే బాలక్రిష్ణ రూలర్ సినిమాని డిసెంబర్ 20న లాక్ చేశారు. ఆ మూవీ పక్కా మాస్. పైగా బాలయ్యకు అచ్చి వచ్చిన పోలీస్ వేషం. ఈ మూవీతో హిట్ కొట్టి ట్రాక్ లో పడాలని బాలయ్య  పట్టుదలగా ఉన్నాడు. పైగా బాలయ్య ఇపుడు ఫాం లో లేడు. వరసగా రెండు డిజాస్టర్లు ఉన్నాయి. దాంతో ఎలాగైనా  సక్సెస్  కావాలి మరి. ఇక ఈ మూవీ మీద హోప్స్ అయితే ఉన్నాయి. కానీ పోటీలో రెండు సినిమాలు ఉండడంతఒ కలెక్షన్లు ఎలా చీలిపోతాయో చూడాలి. మరో మూవీ తీసుకుంటే రవితేజా డిస్కో రాజా. రవితేజాకు కూడా హిట్లు ఈ మధ్య అసలు లేవు. ఆయన సైతం సక్సెస్  కొసం త‌పిస్తున్నరనే చెప్పాలి. మరి డిస్కో రాజాతోనైనా ట్రాక్ లో పడతానని రవితేజా భావిస్తున్నాడుట.


ఇంకో హీరో సాయితేజ్. ఆయన లేటెస్ట్ మూవీ చిత్రలహరి కూడా పెద్దగా ఆడలేదు. అంతకు ముందు సినిమాలు కూడా వరసగా ఫ్లాప్ టాక్ మూటకట్టుకున్నాయి. దాంతో తన కెరీర్ కి పండుగ అవుతుందని మారుతి డైరెక్షన్లో ప్రతి రోజు పండుగ అంటూ డిసెంబర్ 20న వస్తున్నాడు. సో ఈ ముగ్గురు హీరోలకు హిట్ ఒకటి పడాలి. కానీ అక్కడ అంత స్కోప్ ఉందా. క్రిస్మస్ తెలుగు వారికి పెద్ద సీజన్ కాదంటారు. టాలీవుడ్ కి డిసెంబర్లో భారీ సక్సెస్ లు  ఎపుడూ లేవు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: