విభిన్నమైన కథలు ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. తనదైన శైలి నటనతో   అందరినీ కట్టిపడేసే మహేష్ బాబు... విభిన్న కథా నేపథ్యం ఉన్న సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ లో మెరుస్తూ మెప్పిస్తున్నాడు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలు మహేష్ బాబు తన కెరీర్ లోనే మొదటి సారి ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. దీంతో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మహేష్ బాబు ఎలా అదరగొడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

 

 కాగా మహేష్ బాబు సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతోనే గత 13 ఏళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పిన విజయశాంతి టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే తాజాగా విడుదలైన విజయశాంతి ఫస్ట్ లుక్ కూడా అందరినీ ఆకర్షించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో తీసిన ఓ  ఫోటో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ప్రొఫెసర్ భారతి గా విజయశాంతి ఈ సినిమాలో కనిపించనున్నారు అన్న వార్త కూడా బయటకు వచ్చింది .

 

 

 

 కాగా  సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్లో విజయశాంతి ఏదో చెబుతుంటే మహేష్ నవ్వులు చిందిస్తున్న చిత్రం ఒకటి బయటకు వచ్చి అందరిని ఆకర్షిస్తుంది. ఇదే ఫోటోలో  విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కనిపిస్తూ ఉండటం గమనార్హం. కాగా  ఈ మద్యే  విడుదలైన విజయశాంతి ఫస్ట్ లుక్ కూడా అందరినీ ఆకర్షిస్తూ తెగ వైరల్ అయిపోయింది. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ స్పాట్లో రేర్ ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. కాగా  మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 12న సంక్రాంతి పండుగ రోజు సినీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: