చిరంజీవి మెగా స్టార్ స్టేటస్ కు వెళ్ళిపోయినప్పటికీ తన సమిష్టి కుటుంబ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా తన సమిష్టి కుటుంబ సభ్యులతో పండుగలను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
దీపావళి రోజున
చిరంజీవి ఇంటిలో జరిగిన
పండుగ విందుకు మెగా స్టార్ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఎంజాయ్ చేయడమేకాకుండా
పవన్ కళ్యాణ్ పిల్లలతో
చిరంజీవి సరదాగా గడిపిన ఫోటోలను చూసిన నందమూరి అభిమానులు బాలకృష్ణను ఒక వింతకోరిక కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నందమూరి అభిమానుల మధ్య వైరల్ గా మారాయి. చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉన్నా మెగా ఫ్యామిలీని ఒక త్రాటి పైకి తీసుకు వచ్చిన
చిరంజీవి తన ఫ్యామిలీ హీరోలను పరోక్షంగా ప్రమోట్ ప్రమోట్ చేయడమే కాకుండా తన కుటుంబ హీరోలు అందరికి
గాడ్ ఫాదర్ లా అనుసరితున్న వ్యూహాలను గుర్తుకు చేస్తూ బాలయ్యను నందమురి అభిమానులు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు.
బాలకృష్ణ కూడ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇలా నందమూరి హీరోల డిన్నర్ పార్టీలను హోస్ట్ చేస్తే అది నందమురి అభిమానులకు పండుగగా ఉంటుంది కదా అంటూ కొందరు నందమురి వీరాభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
బాలకృష్ణ ఇలా వ్యహరిస్తే జూనియర్
ఎన్టీఆర్ అభిమానులకు కూడ
బాలయ్య పై గౌరవం పెరిగి
బాలయ్య సినిమాలకు మరింత మంచి ఓపెనింగ్స్ వస్తాయి కదా అంటూ నందమూరి అభిమానులు బాలయ్యకు సూచనలు ఇస్తున్నారు.
అంతేకాదు
బాలకృష్ణ ఒక్క పిలుపు ఇస్తే జూనియర్
కళ్యాణ్ రామ్ తారక్ రత్నలు బాలయ్యకు బాసటగా నిలిచి అతడి క్రేజ్ పడిపోకుండా వ్యూహాత్మకంగా సహకరించినట్లు అవుతుందని నందమూరి అభిమానుల అభిప్రాయం. అయితే నందమూరి అభిమానులు ఇస్తున్న సూచనలు
బాలకృష్ణ అనుసరిస్తాడా అన్నది సందేహం. ఇప్పటికే ఈ కుటుంబ హీరోలలో అనేక గ్యాప్ లు ఉన్న పరిస్థితులలో మెగా ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలు నందమూరి ఫ్యామిలీ హీరోలతో కనిపించాలి అంటే వారి ఇగో సమస్యల నుండి వారంతా రాజీ పడవలసి వస్తుంది..