ఎన్నికలలో ఓడిన తరువాత పవన్ కళ్యాణ్ కు రాజకీయ పరిణితి బాగా వచ్చినట్లు కనిపిస్తోంది. నవంబర్ మొదటివారంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న ఇసుకు విధానానికి నిరసనగా చేపట్టబోతున్న నిరసన ర్యాలీకి భారీ స్థాయిలో భావన నిర్మాణ కార్మీకులు అదేవిధంగా తన అభిమానులు చాల భారీ సంఖ్యలో వస్తారని పవన్ ఆశిస్తున్నాడు.

ఇలాంటి సందర్భంలో తన ఉద్యమానికి మరింత స్పందన రావడానికి పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ఒక లేటెస్ట్ వ్యూహం రాజకీయ పక్షాలకు తలనొప్పిగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ఈ నిరశన ఉద్యమంలో తనతో కలిసి పాల్గొనమని ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీలు అయిన తెలుగుదేశం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులకు బహిరంగ ఉత్తరాలు వ్రాయడం ఇప్పుడు ఈ ప్రముఖ రాజకీయ పార్టీలు అన్నింటికి సమస్యగా మారినట్లు తెలుస్తోంది.

పవన్ ఉత్తరాలకు స్పందించి ఈ రాజకీయ పార్టీల కార్యకర్తలు మధ్యశ్రేణి నాయకులు పవన్ తో పాటు ఈ రాజకీయ పోరాటంలో పాల్గొంటే పవన్ నాయకత్వాన్ని అంగీకరించినట్లు అవుతుందనీ పాల్గోనకపోతీ భావన కార్మికుల దృష్టిలో తాము శతృవులుగా మారుతామని రాజకీయ పార్టీల నేతలు అంతర్మధనంలో ఉన్నట్లు టాక్. దీనితో పవన్ పిలుపుకు స్పందించాలా లేకుంటే కేవలం సంఘీభావం తెలిపి అక్కడితో సరిపెట్టాలా అన్న విషయం తేల్చుకోలేక అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఆంధ్రపదేశ్ లో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు పెరిగి పోతున్న నేపధ్యంలో పవన్ వ్యూహాలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి అన్న విషయమై ప్రస్తుతం ప్రతిపక్ష రాజకీయ పార్టీలలో కూడ భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో నవంబర్ లో జరగబోయే పవన్ ఇసుక పోరాట యాత్ర ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అన్న విషయం పై ఆసక్తి పెరిగిపోతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: