తమిళ హీరో  కార్తి నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీ ఇటీవల విడుదలై  ప్రస్తుతం  బాక్సాపీస్ వద్ద అదరగొడుతుంది.  మొదటి షో నుండే  యూనానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో  కోలీవుడ్ లోనే  టాలీవుడ్ లోను ఖైదీ సత్తా చాటుతుంది.  ఇక ఈ చిత్రంలో  తమిళ నటుడు  జార్జ్  మర్యన్ నటన  అందరిని ఆకట్టుకుంటుంది. సిన్సియర్  కానిస్టేబుల్  గా నటించిన  మర్యన్   ఈసినిమాకు ఓ హైలైట్ గా చెప్పవచ్చు.  ఇక ఈ సినిమా ఆయనకు  ప్రశంసలు మాత్రమే కాకుండా   ఓ భారీ ఆఫర్ ను తెచ్చిపెట్టింది.



క్రియేటివ్ డైరెక్టర్  శంకర్ - లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం  ఇండియన్ 2. ఈచిత్రంలో  జార్జ్ మర్యన్  ఓ కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం. గత కొన్ని నెలల నుండి  ఈ చిత్రం రెగ్యులర్  షూటింగ్  జరుపుకుంటుంది.  అందులో భాగంగా   ప్రస్తుతం  భోపాల్ లో  కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  కాజల్ కథానాయికగా నటిస్తుండగా   రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవాని శంకర్ , అనిల్ కపూర్ ,సిద్దార్థ్ , వెన్నల కిషోర్, విద్యుత్ జంవాళ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి  యంగ్ మ్యూజిక్  సెన్సేషన్  అనిరుధ్ రవిచంద్రన్   సంగీతంఅందిస్తున్నాడు. కమల్ -శంకర్  కలయికలో  ఇది రెండో చిత్రం.   ఇంతకుముందు 1996లో వీరి కాంబినేషన్ లో వచ్చిన   ఇండియన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మరి ఇన్ని  సంవత్సరాల తరువాత  ఈ చిత్రానికి  కి సీక్వెల్ గా వస్తున్న ఈ  ఇండియన్ 2  ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.   వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం  తమిళం తో పాటు తెలుగు ,హిందీ భాషల్లో విడుదలకానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: