విజయశాంతి 80వ తరం నాటి హీరోయిన్. ఆమె అప్పట్లో ఏకంగాసూపర్ స్టార్ క్రిష్ణ పక్కన కిలాడి క్రిష్ణుడు మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆమె మహిళా దర్శకురాలు  విజయనిర్మల డిస్కవరీ. ఇదిలా ఉండగా 80 దశకం అంతా నాది అని చెప్పుకునేలా విజయశాంతి టాప్ హీరోయిన్ గా చెలరేగిపోయారు. ఓ వైపు చిరంజీవి, మరో వైపు బాలక్రిష్ణ లతో ఆమె పెయిర్ గా నటించి ఎన్నో హిట్లు సొంతం చేసుకున్నారు. మరి విజయశాంతి తరువాత కాలంలో హీరోలతో సరిసమానంగా పేరు తెచ్చుకోవడంతో ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువగా చేస్తూ వచ్చారు.


రాములమ్మగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి చేసిన మూవీ హిట్ అయ్యాక ఆమెకు రాజకీయాలపైన మనసు మళ్ళింది. దాంతో 2005లో సినిమాలకు విరామం ప్రకటించి రాజకీయ అరంగేంట్రం చేశారు. టీయారెస్ ఎంపీగా గెలిచి తెలంగాణా సాధనలో తన వంతు కీలకమైన పాత్ర పోషించారు. విజయశాంతి మంచి నటి అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె రాజకీయాల్లోకి వెళ్ళడంతో సినిమా రంగం లో కొంత లోటు ఏర్పడింది అని చెప్పాలి. విజయశాంతి వేయాల్సిన క్యారక్టర్లు కొన్ని అలాగే ఉండిపోయాయి కూడా. ఆమె డ్రీమ్  ప్రాజెక్ట్  గా రాణీ రుద్రమదేవి చేయాలని భావించిందిట.


దాని కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తిగా రెడీ చేసి పెట్టుకున్నారట. రాణీ రుదమకు సంబంధించి 1234 నుంచి 1284 మధ్యలో రుద్రమదేవి జీవితకథను ఎంచుకుని చక్కంగా కూర్పు చేసుకున్నారట. ఇక రుద్రమకు 34వ ఏట పట్టాభిషేకం జరిగింది మొదలు 84 ఏళ్ల వయసు వరకూ కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించారు. ఆ చరిత్ర మొత్తం తీసి చూపించాలన్న ఉద్దేశ్యం ఆమెకు ఉంది. కానీ రాజకీయాల  వల్ల వీలు చిక్కలేదు. అయితే ఈ లోగా 2015 లో డైరెక్టర్ గుణశేఖర్ రుద్రమదేవి మూవీని తీశారు. ఆయన అనుష్కను హీరోయిన్ గా పెట్టి మరీ సినిమాను పూర్తి చేశారు. అనుష్క బాగా నటించినా ఆ పాత్ర విజయశాంతి పోషిస్తే ఇంకా నిండుగా ఉండేదని అనే వారు లేకపోలేదు. మొత్తానికి విజయశాంతి తన కలల పాత్రను ఆ విధంగా జారవిడుచుకున్నారన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: