జ్యోతక్క... ఒక ఎమోషన్. మీకు ఈ పాటికే అర్ధం అయిపోయి ఉంటుంది జ్యోతక్క ఎవరో. అవును బిగ్ బాస్ కంటెస్టెంట్  శివజ్యోతి. బిగ్ బాస్ షో కి రాక ముంది ఒక యాంకర్ గా పాపులర్ ఐన శివజ్యోతి బిగ్ బాస్ షో తో జ్యోతక్క గా అందరి మనసులో గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. కాగా గతవారం బిగ్ బాస్ నుంచి శివజ్యోతి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. 


బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన శివజ్యోతి  ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే సమయంలో హౌస్ లోని వ్యక్తులంతా తనతో చాలా బాగున్నారని, ఇన్ని రోజులు సొంత మనిషిలా అభిమానించారని, అందరితో కలిసిపోయానని చెప్పింది శివజ్యోతి.  బిగ్ బాస్ హౌస్ లో అందరి చేత అక్క అని పిలిపించుకొని పిలిపించుకున్న ఏకైక వ్యక్తి శివ జ్యోతి.


బిగ్ బాస్ హౌస్ లో పాల్గొని బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తుంటే జ్యోతి మాత్రం బిగ్ బాస్హౌస్ తనకు బాగా నచ్చిందని బిగ్ బాస్ షో లో పాల్గొనటం ఒక మంచి అనుభవం అని అంటుంది. ఇటువంటి బిగ్ బాస్ షోనీ ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా పాల్గొని  చూడాలి అంటుంది జ్యోతి.ఈ సందర్భంగా మాట్లాడుతూ బిగ్ బాస్ షో ని ఒక అద్భుత ప్రపంచం అని ఆకాశానికి ఎత్తేసింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లన్నిటిని ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పింది జ్యోతి. కానీ బిగ్ బాస్ లో నచ్చని విషయం ఏంటి అంటే ఎప్పుడూ సంతోషంగా, ఉషారుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించే తనని  కేవలం ఎమోషన్స్ సీన్స్ లో మాత్రమే ఎక్కువగా ఎలివేట్ చేసి చూపించారని చెప్పి బాధ పడింది.


బిగ్ బాస్ హౌస్ లో తాను ఎంతగానో  ఆడి, పాడానో...  ఎంత సంతోషంగా ఉన్నాను నాకే తెలుసుకానీ అటువంటి ఉత్సాహభరితమైన సందర్భాలను బిగ్బాస్ చూపించక పోవడం బాధగా అనిపించింది అంటుంది జ్యోతి. బిగ్ బాస్ కి ఒక వేళ నా ఏడుపు బాగా నచ్చిందేమో....అందుకే నా ఏడుపు మొహాన్ని మాత్రం చూపించాడు  అని చిన్నబుచ్చుకుంది.బిగ్ బాస్ షో లో  ఎమోషన్ సీన్స్ తో బాగా ఫేమస్ అయిపోయిన జ్యోతి  'జ్యోతక్క - ది ఎమోషన్' అనే పేరుని సంపాదించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: