మెగా హీరోగా అల్లు వారి అబ్బాయిగా  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు  అల్లు అర్జున్. అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించి ప్రేక్షకుల స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఇక ఇప్పుడు టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే టాలీవుడ్ లో అదో ప్రత్యేకమైన క్రేజ్. అల్లు అర్జున్ సినిమాలో  డాన్సులు డైలాగులతో హోరెత్తిస్తుంటారు  అల్లు అర్జున్. అయితే టాలీవుడ్ టాప్ హీరోల రేసులో ఉన్న అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్ కూడా టాప్ గానే ఉంటుంది. అల్లుఅర్జున్ ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. కాగా  అల్లు అర్జున్ సినిమాలకు కూడా 80 కోట్లకు పైగా మార్కెట్ ఉంటుంది. 



 ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఒకప్పుడు మొదటి సినిమాకి ఎంత  రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు... గంగోత్రి సినిమా తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్. ఆ సినిమాలో  ఏ హీరో తీసుకోలేనంత... అసలు మాటల్లోనే చెప్పాలేనంత  తక్కువ రెమ్యునరేషన్  తీసుకున్నాడు. అయితే బన్నీ కి తొలి పారితోషికం ఇచ్చింది ఎవరో కాదు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దర్శకేంద్రుడు చేతులమీదుగానే తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. దర్శకేంద్రుడు తెరకెక్కించిన 100 సినిమా... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మొదటి సినిమా. అదే గంగోత్రి సినిమా. 2003లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.  మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించటంతో...  బన్నీ కెరీర్ కు మంచి బాటలు వేసింది ఈ సినిమా . ఇక ఈ చిత్రం తర్వాత ఆర్య బన్నీ సినిమాలతో వరుస విజయాలు  అందుకున్నాడు అల్లు అర్జున్. 



 అయితే గంగోత్రి సినిమా తర్వాత మళ్లీ కె.రాఘవేంద్రరావు తో అల్లు అర్జున్ సినిమా చేయలేదు. అయితే ఈమధ్య ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే షోకి హాజరైన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు... కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు. అల్లు అర్జున్ కి తానే తొలి రెమ్యూనరేషన్ ఇచ్చానని... అప్పట్లో అల్లు అర్జున్ డాన్స్ చూసి వాళ్ళ అమ్మ కు వంద రూపాయలు ఇచ్చాను అంటూ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. అయితే ఒకప్పుడు దర్శకేంద్రుడు  సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్  ఎన్నో విజయాలు అందుకుంటూ అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం స్టార్ హీరోల రేసులో   కొనసాగుతున్నారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ అలా వైకుంటపురములో  అనే సినిమాలో నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: