ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలో కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. తండ్రి చిరంజీవి రాజకీయాల నుండి సినిమాల వైపు దృష్టి మళ్లించిన క్రమంలో దగ్గరుండి తండ్రి నటిస్తున్న సినిమాలను నిర్మించి చిరంజీవికి అదిరిపోయే రేంజ్ లో కొడుకుగా మరియు నిర్మాతగా విజయాలు అందిస్తున్నాడు. ఇటీవలే చిరంజీవి నటించిన 'సైరా' సినిమా నిర్మించి సూపర్ డూపర్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి జోష్ మీద ఉన్న రామ్ చరణ్... రాజమౌళి తో చేస్తున్న rrr సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.


సైరా సినిమా అదిరిపోయే రేంజ్ లో హిట్ అవడంతో చాలా ఉత్సాహంగా rrr సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటున్నారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం షూటింగ్ కి కాస్త గ్యాప్ దొరకటంతో….రామ్ చరణ్ తేజ్ rrr సినిమా తర్వాత చేయబోయే సినిమా కోసం స్టోరీలు రెడీ చేయాలని డైరెక్టర్స్ కి కాల్ ఇవ్వటంతో..'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ రాంచరణ్ ని కలసి ఓ స్టోరీ లైన్ వినిపించాడట. ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పూర్తి కథ సిద్ధం చేసి తనకు నేరేషన్ ఇవ్వాలని రాంచరణ్ విక్రమ్ కుమార్ ని కోరినట్లు తెలుస్తోంది.


విక్రమ్ కుమార్ ఎంచుకునే కథాంశాలన్నీ మాస్ ప్రేక్షకులకు దూరంగా ఉంటాయి. విక్రమ్ తెరక్కించిన చిత్రాల్లో మనం, ఇష్క్ మంచి విజయం సాధించాయి. 24, హలో, గ్యాంగ్ లీడర్ చిత్రాలు బావున్నప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ అనే పూర్తి మాస్ తరహా స్వతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన సినిమా తర్వాత రాంచరణ్ విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కష్టమని రిజల్ట్ తారుమారయ్యే అవకాశం ఉందని ఇది రిస్క్ అంటూ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది రామ్ చరణ్ తీసుకోబోతున్న నిర్ణయంపై కామెంట్లు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: