నందమూరి కళ్యాణ్ రామ్ కి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలంటు తన కెరీర్ లో ఏవీ లేవనే చెప్పాలి. అతనొక్కడే లాంటి కొన్ని సినిమాలు మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకున్నాయి తప్ప రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చిన సినిమా గానీ రికార్డ్స్ బద్దలు కొట్టిన సినిమా గానీ కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక్కటంటే ఒక్కటీ లేదు. అయినా సొంత బ్యానర్ లో... బయట బ్యానర్ లలో వరుసగా సినిమాలు మాత్రం చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్య కళ్యాణ్ రామ్ కి టెక్నికల్ గా కాస్త చెప్పుకోదగిన సినిమా అంటే 118. ఈ సినిమా బాగానే ఆడింది. కలెక్షన్స్ పరంగా ఒకే అనిపించుకుంది. మహేష్ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్ గా నటించారు. 

ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మరో సినిమాతో వస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించే దర్శకుడు శతమానం భవతి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆకట్టుకున్న సతీష్ వేగ్నిశ డైరక్షన్ లో  నటిస్తున్నాడు. గుజరాతీ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఈ సినిమాని 2020 సంక్రాంతి బరిలో మహేష్ బాబు, అల్లు అర్జున్, సూపర్ స్టార్ రజనీ కాంత్ వంటి స్టార్ హీరోలకు పోటీగా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మరోసారి మహేష్ కోనేరు నిర్మాణంలో నటించబోతున్నాడు. నందమూరి సోదరులైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు పీఆర్వోగా చేసిన మహేష్ కోనేరు నిర్మాతగా మారి వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ సారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చేది కొత్త సినిమానా లేక 118 కి సీక్వెలా అన్నది మాత్రం క్లారిటి లేదు. ఇక ఈ సినిమా తరువాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేయబోయే సినిమాను ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నాడు ఈ నందమూరి హీరో. ఇదిలా ఉంటే ఎప్పుడో 6 నెలల క్రితం అనుకున్న ఒక సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. కొత్త దర్శకుడు మల్లిడి వేణు తీసుకువచ్చిన కథ నచ్చడంతో తనే నిర్మించాలని డిసైడ్ అయ్యారు హీరో కళ్యాణ్ రామ్. ఈ సినిమాకు 'తుగ్లక్' అన్న టైటిల్ కూడా రిజిస్టర్ చేపించి అదే టైటిల్ ను అనౌన్స్ కూడా చేశారు. మరి ఈ 'తుగ్లక్' సినిమా ఉందా లేదా అన్నది ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. కొత్త దర్శకుడు మల్లిడి వేణు కు ఏదైనా సమస్యా లేక ఎక్స్‌పరిమెంట్ ఇప్పుడెందుకు అని కళ్యాణ్ రామ్ ఆగాడా అన్నది క్లారిటి లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: