ఈమధ్య కాలంలో మీడియం రేంజ్ హీరోలు సినిమాలు చేస్తూనే నిర్మాతలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వెరైటీ సినిమాలను తీయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నాలలో వారికి అనేక ఎదురు దెబ్బలు తగులుతున్న పరిస్థితులలో నాని సందీప్ కిషన్ శర్వానంద్ లాంటి హీరోలకు ఆర్ధిక నష్టాలు కూడ వచ్చాయి.

ఇలాంటి పరిస్థితులలో ప్రేక్షకుల అభిరుచి తెలియక అనుభవం ఉన్న నిర్మాతలు కూడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ పరిస్థితులలో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేస్తున్న ప్రయత్నం ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి. తనకు హీరోగా లైఫ్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ను హీరోగా మార్చి విజయ్ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ రేపు విడుదల కాబోతోంది. 

మూవీ కోసం విజయ్ దేవరకొండ స్వయంగా రంగంలోకి దిగి ప్రమోట్ చేస్తున్నా ఈ మూవీ పై చెప్పుకోతగ్గ స్థాయిలో ప్రేక్షకులలో క్రేజ్ ఏర్పడటం లేదు. దీనికితోడు ఈ మూవీ ట్రైలర్ ను చూసిన వారికి ఈ మూవీ ఒక డిఫరెంట్ టేకింగ్ తో తీసిన మూవీగా కనిపిస్తోంది. దీనితో సగటు ప్రేక్షకుడు ఈ మూవీకి ఎంత వరకు కనెక్ట్ అవుతాడు అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

విజయ్ నిర్మాతగా చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అయితే ఇంకా చాల డిఫరెంట్ జోనర్లలో సినిమాలు తీయాలనే ఆలోచనలలో ఉన్నాడు. అయితే సగటు ప్రేక్షకుడు విజయ్ ఆలోచనలకు ఎంత వరకు సహకరిస్తాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం అంచనాలు లేకుండా విడుదలైన చాల సినిమాలు సూపర్ హిట్ గా మారుతున్నాయి. కేవలం ప్రేక్షకుల మౌత్ టాక్ తో ఈసినిమాలు సూపర్ హిట్ అయిపోతున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన కార్తీ ‘ఖైదీ’ సూపర్ హిట్ టాక్ కూడ ప్రేక్షకుల మౌత్ టాక్ వల్ల వచ్చింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: