దీపావళి కానుకగా గత శుక్రవారం తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకున్నాయి స్టార్ హీరో  విజయ్ నటించిన  విజిల్ అలాగే కార్తి నటించిన ఖైదీ.  అయితే  మొదటి 5రోజులు తెలుగు రాష్ట్రాల్లో  ఖైదీ కంటే విజిల్ ఎక్కువ వసూళ్లను రాబట్టినా  ఎక్స్ట్రాడినరీ టాక్ తో రోజు రోజుకు పుంజుకుంటూ   బుధవారం  విజిల్ ను దాటేసింది  ఖైదీ. 



తెలుగురాష్ట్రాల్లో  6వరోజు విజిల్ 34లక్షలవసూళ్లను రాబట్టగా  ఖైదీ  45 లక్షల  వసూళ్లను కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా వస్తున్న టాక్ తో  ఫుల్ రన్ లో   భారీ లాభాలనుతీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది.  ఇప్పటివరకు  ఖైదీ తెలుగు లో  4.46 కోట్ల వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ మార్క్  కు చేరువైంది.  ఇక విజిల్ ఇప్పటివరకు  9కోట్ల షేర్ ను రాబట్టింది. ఈచిత్రం  బ్రేక్ ఈవెన్ కావాలంటే  మరో కోటి రూపాయలను రాబట్టాల్సి వుంది.  ఖైదీ దెబ్బకు  విజిల్  ప్రస్తుతం  బాక్సాఫీస్ వద్ద  నెమ్మదించింది. ఇంటెన్సివ్ యాక్షన్  డ్రామా  నేపథ్యంలో లోకేష్  కనకరాజ్ తెరకెక్కించిన  ఈ చిత్రానికి  సామ్ సీఎస్  అందించిన నేపథ్య సంగీతం అందించగా  డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్ ఆర్ ప్రభు నిర్మించాడు. తెలుగులో ఖైదీ ని కేకే రాధామోహన్  విడుదలచేశాడు.  ఈచిత్రం  హీరోయిన్ , సాంగ్స్ లేకుండా  తెరకెక్కడం విశేషం.   



తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ  6వ రోజువసూళ్ల వివరాలు : 
నైజాం : 18 లక్షలు 
సీడెడ్ : 8 లక్షలు 
గుంటూరు :3 లక్షలు
కృష్ణా : 3.3 లక్షలు
పశ్చిమ గోదావరి : 2.1 లక్షలు 
తూర్పు గోదావరి : 3.3లక్షలు 
ఉత్తరాంధ్ర : 4.8 లక్షలు 
నెల్లూరు : 2 లక్షలు 
ఏపీ &తెలంగాణ లో 6వ  రోజు షేర్ మొత్తం =45 లక్షలు 





మరింత సమాచారం తెలుసుకోండి: