సౌత్ క్రేజీ సీక్వెల్ భారతీయుడు 2 సినిమాలో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ అదేనా? చందమామ పాత్ర ఆ పాత్రకు కొనసాగింపుగా ఉంటుందని వినిపిస్తోంది. ఇండియన్ 2లో కాజల్ పాత్ర గురించి ఇపుడు ఇండస్ట్రీలో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. 


రెండు దశాబ్దాల కిందట రిలీజైన భారతీయుడు సినిమా ఓ సెన్షేన్షన్. ఓ టైంలోనే దర్శకుడు శంకర్, భారతీయుడు సినిమాను టెక్నికల్ వండర్ గా తీర్చిదిద్దాడు. ఆ సినిమాలోని హీరో హీరోయిన్ లుక్స్, మేకప్ కు సంబంధించి అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద చర్చనే సాగింది. అలాంటి సినిమాకు సీక్వెల్ గా శంకర్ ఇండియన్ 2తెరకెక్కిస్తుండటంతో అంచనాలు స్కైరేంజ్ లో ఉన్నాయి. 


ఇండియన్ 2లో కమల్ హాసన్, సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కమల్ పాత్ర తప్పా మిగతా వారి పాత్రలు ఏంటన్నది సస్పెన్స్. అయితే ఇప్పుడు కాజల్ పాత్రపై చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వినిపిస్తోంది. ఇండియన్ 2 సినిమాలో కాజల్ భారతీయుడులో సుకన్య నటించిన వృద్ధురాలి పాత్రల కనిపించబోతున్నట్టు వినిపిస్తోంది. 


ఇండియన్ 2సీక్వెల్ లో కమల్ హాసన్ 90ఏళ్ల సేనాపతి పాత్రలో కనిపించబోతున్నాడు. కమల్ కు జోడీగా కాజల్ 85ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. కాజల్ మేకప్ కోసం హాలీవుడ్ టెక్నీషన్స్ ని తీసుకొచ్చారట. శంకర్ సినిమాలో హీరోయిన్స్ పాత్రలకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే విధంగా ఈ సినిమాలో కూడా శంకర్, సేనాపతి భార్య పాత్రలో కాజల్ కు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. భారతీయుడు సీక్వెల్ లో భామగా కాజల్ ఛాలెంజింగ్ రోల్ లో కనిపించబోతున్నట్టే కనిపిస్తోంది. 
మరి కాజల్ భారతీయుడు 2లో ఎలా మెప్పిస్తుందో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: