సూపర్ స్టార్ మహేష్ తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే మహేష్ ఇంత పెద్ద హీరో అవుతాడని తాను ముందే ఊహించానని అంటుంది సీనియర్ హీరోయిన్ విజయశాంతి. మహేష్ చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడే విజయశాంతి తో కలిసి నటించడం జరిగింది. అప్పుడు చబ్బీగా ఉన్న మహేష్ ఇంత పెద్ద స్టార్ అవుతాడని ఊహించలేదు.


అయితే అతని మొదటి సినిమా చూసినప్పుడు మాత్రం పెద్ద హీరో అవుతాడని అనిపించింది. సచిన్ టెండుల్కర్ ఎంత పెద్ద క్రికెటర్ అయ్యాడో మహేష్ ను చూసినప్పుడు అంతే పెద్ద సూపర్ స్టార్ అవుతాడని అనిపించిందట. ఇక సెట్ లో మహేష్ పెద్దలతో గౌరవంగా మాట్లాడుతున్నాడని విజయశాంతి అన్నారు. మహేష్ ను తాను సెట్ లో బాబు అని పిలుస్తానని.. మహేష్ మాత్రం అప్పుడప్పుడు అమ్మా అని.. మేడం అని పిలుస్తున్నారని అన్నది.


పెద్ద హీరో అని డాబు పోకుండా డౌన్ టూ ఎర్త్ గా ఉంటాడని కితాబిచ్చారు. కృష్ణ గారు చాలా సాఫ్ట్.. మహేష్ డౌన్ టూ ఎర్త్ అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ కు సంతోషాన్ని నింపేలా చేసింది విజయశాంతి. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. 


మహేష్ కనిపించడానికి సైలెంట్ గా ఉంటాడు కాని తన సెన్ సాఫ్ హ్యూమర్ గురించి అందరు చెబుతూ ఉంటారు. సెట్ లో మహేష్ ఉన్నాడు అంటే సందడిగా ఉంటుందని ఇదివరకు చాలామంది చెప్పారు. సెట్ లో తానొక పెద్ద స్టార్ అన్న బిల్డప్ ఏమి లేకుండా అందరిని మనస్పూర్తిగా పలుకరిస్తాడని తెలుస్తుంది. దాదాపు ఇప్పటి అందరి హీరొలకు ఈ మంచి క్వాలిటీ ఉందని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: