దర్శకుడు కొరటాల శివను నమ్మి ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని కొరటాల పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంతో ‘మిర్చి’ లాంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఆ తరువాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలని ప్రయత్నించినా వీరిద్దరూ ఎవరికివారు బిజీ అయిపోవడంతో వీరి కాంబినేషన్ సెట్ కాలేదు. 

ఇలాంటి పరిస్థితులలో ‘సాహో’ పరాజయం తరువాత ప్రభాస్ కొరటాల మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి జరిగిన ప్రాధమిక ప్రయత్నాలకు రామ్ చరణ్ ఆదిలోనే చెక్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మధ్య కొరటాల ప్రభాస్ ను కలిసి ఒక వెరైటీ కథను చెప్పినట్లు సమాచారం. 

ఈ కథ ప్రభాస్ కు బాగా నచ్చడంతో ఆ స్టోరీ లైన్ ను డెవలప్ చేయమని ప్రభాస్ కొరటాలతో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలను పసికట్టిన రామ్ చరణ్ ను కొరటాలతో అతడిని ప్రభాస్ సినిమా కమిట్ కావద్దని ప్రస్తుతం చిరంజీవితో తీస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే తన డేట్స్ కోరతాలకు ఇస్తానని అందువల్ల మరొక హీరోతో సినిమా చేసే ఆలోచనను విరమించుకోమని కోరినట్లు సమాచారం. 

అంతేకాదు తాను కొరటాలతో చేయబోయే మూవీని కూడ కొరటాల సొంత బ్యానర్ లో చేస్తానని ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదల తరువాత వచ్చే సినిమాగా కొరటాల చరణ్మూవీ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ మూవీ వల్ల కొరటాలకు చాల మంచి లాభాలు వస్తాయని ఆశ కల్పించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో కొరటాల మరో రెండు సంవత్సరాల పాటు మెగా కాంపౌండ్ ను నమ్ముకుని మిగతా హీరోలకు దూరం కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో కొరటాల పై ప్రభాస్ పెట్టుకున్నఆశలు ఆదిలోనే కరిగిపోతున్నాయి అన్న అభిప్రాయం కలుగుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: