సంక్రాంతి వచ్చింది అంటే సినిమాల పండుగ వచ్చినట్టే.. సంక్రాంతి సీజన్ లో స్టార్స్ తమ అభిమానులను అలరించేందుకు సినిమాలను రిలీజ్ చేస్తారు. పండుగ పెద్దదే కాబట్టి ఎలా లేదన్నా 3, 4 సినిమాలు రిలీజ్ అవ్వాల్సిందే. ఎప్పటిలానే 2020 సంక్రాంతికి సినిమాల రిలీజ్ లు ఉన్నాయి. అయితే మహేష్, అల్లు అర్జున్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు.


జనవరి 12న సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ ప్లాన్ చేయగా.. అదే డేట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ అంటున్నారు. రెండు సినిమాలు జనవరి 12న రిలీజ్ అంటూ హైలెట్ చేస్తూ పోటాపోటీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలాఉంటే ఈ పోటీ పట్ల హీరోల మధ్య ఏమో కాని అభిమానుల మధ్య గొడవలకు దారి తీస్తుంది.


అందుకే మహేష్ ఓ మెట్టు దిగి ఒకే రోజు కాకుండా కనీసం రెండు రోజుల వ్యవధిలో రెండు సినిమాలు వచ్చేలా రిలీజ్ ప్లాన్ చేయాలని సజెస్ట్ చేశాడట. జనవరి 11న ఒక సినిమా వస్తే.. జనవరి 13న మరో సినిమా రిలీజ్ చేస్తే బెటర్ అన్నట్టుగా డిస్కషన్స్ జరిగాయట. అయితే మధ్యలో వెంకటేష్, నాగ చైతన్య వెంకీమామ కూడా సంక్రాంతికే రిలీజ్ అన్నారు. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.


11, 13 మహేష్, అల్లు అర్జున్ సినిమాలు వస్తే మధ్యలో 12న వెంకీమామ వస్తే మళ్లీ కలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోపక్క సూపర్ స్టార్ రజినికాంత్ దర్బార్ కూడా జనవరి 10న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. మొత్తానికి ఈ పండుగకు సిని ప్రియులు మరింత కలర్ ఫుల్ గా చేసుకునేలా ఈ సినిమాలు వస్తాయని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: