టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు విప్పేసి నిరసన తెలిపి సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనం సృష్టించిన శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీ హీరోలపై ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్లు చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ గా మారుతూ అడపదడప సమాజములో పేరు ప్రఖ్యాతులు గడించిన వారిపై వారు తీసుకున్న నిర్ణయాలపై టార్గెట్ చేస్తూ వీడియోలు పోస్ట్ లు చేస్తూ రాణిస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎంతగానో ట్రై చేస్తుంది.


ఇటువంటి తరుణంలో తాజాగా శ్రీ రెడ్డి ఇటీవల హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ నీ ఉద్దేశించి పూనం కౌర్ కి ఛాలెంజ్ విసిరింది. డీటెయిల్ గా విషయంలోకి వెళ్తే ఇటీవల పూనమ్ కౌర్ ట్విట్టర్లో...ఒక ట్వీట్ చేశారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అంతే కాకుండా అనేక ఆరోపణలు మరియు అనుమానాలను తీసుకువచ్చింది. ఇంతకీ పూనమ్ చేసిన ట్వీట్ కు తెలుగీకరిస్తే.. అబద్ధం ఆడేవాడు రాజకీయ నాయకుడు అవుతాడేమో కానీ నాయకుడు.. ఎప్పటికీ లీడర్ మాత్రం కాలేడంటూ ట్వీట్ చేసింది.


ఇంతకీ తాను ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశానన్న విషయాన్ని పూనమ్ బయటపెట్టలేదు. ఈ ట్వీట్ కు  తాజాగా రియాక్ట్ అయ్యారు శ్రీరెడ్డి. దమ్ముంటే ధైర్యంగా ట్వీట్స్ చేయ్.. పేరు పెట్టు.. మావాడు చూసుకుంటాడు.. అంతేకానీ ఈ దొంగచాటు ట్వీట్లు ఎందుకంటూ ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి. మరి శ్రీ రెడ్డి విసిరిన ఛాలెంజ్ కి హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందిస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: