బాలీవుడ్ స్టార్ ఇస్తున్న బంపర్ ఆఫర్ ని డాషింగ్ సద్వినియోగం చేసుకుంటాడా? ఆల్ రెడీ బీటౌన్ లో సత్తా చాటిన పూరీ జగన్నాథ్ ఈ సారి స్టార్ డైరెక్టర్ తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడా? బీటౌన్ బడా స్టార్ ఓపెన్ చేసిన ఆఫర్ కు పూరీ ఎలా రియాక్ట్ అవుతాడనేది ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 


ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ పేరు మరోసారి మారుమోగుతోంది. ఫాంలో లేని రామ్ తో దిమ్మతిరిగే మాస్ హిట్ ఇచ్చి డాషింగ్ డైరెక్టర్ గా సత్తాచాటాడు. దీంతో ఇప్పుడు హీరోలు పూరీతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో డాషింగ్ డైరెక్టర్ పూరీకి ఓ బాలీవుడ్ స్టార్ అదిరిపోయే బంపర్ ఆపర్ ఇచ్చాడు. పూరీకి ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఆయన డైరెక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. 


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. పూరీ సినిమా చేస్తానంటే నేను రెడీ అంటూ సల్లూభాయ్ ఓపెన్ అయ్యాడని తెలుస్తోంది. ఓ రకంగా ఇది పూరీకి గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఒకప్పుడు కష్టాల్లో ఉన్న సల్మాన్ ఖాన్ కెరీర్ గాడిలో పడటానికి పరోక్షంగా పూరీ జగన్నాథ్ కారణమని చెప్పాలి. పోకిరీతో తెలుగులో రికార్డ్స్ కొల్లగొట్టిన పూరీ జగన్నాథ్ సినిమాను సల్మాన్ బాలీవుడ్ లో రీమేక్ చేసి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. 


పోకిరి హిందీ రీమేక్ "వాంటెడ్" బాలీవుడ్ లో వందకోట్లు కలెక్ట్ చేసింది. కొరియో గ్రాఫర్ ప్రభుదేవా వాంటెడ్ చిత్రంతోనే బాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.  "వాంటెడ్" సల్మాన్ కెరీర్ తో పాటు బాలీవుడ్ లో ప్రభుదేవా కెరీర్ ను నిలబెట్టింది. ఆ కృతజ్ఞతతోనే సల్మాన్ ఖాన్ పూరీ డైరెక్షన్ లో సినిమా చేయాలని ఉత్సాహం చూపుతున్నాడు. దబాంగ్ 3 రిలీజ్ ప్రమోషన్స్ లో ఉన్న సల్మాన్.. పూరీతో సిినిమా చేస్తా అనడం ఎగ్జయిట్ చేస్తోంది. గతంలో పూరీ జగన్నాథ్ అమితాబ్ బచ్చన్ హీరోగా బుడ్డ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు సల్మాన్ గోల్డెన్ ఆఫర్ ను పూరీ సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: