బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉందో తెలిసిందే. రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ సినిమాను ఏలేశాడు. రోమాంటిక్ హీరోగా అతనికున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అసమాన్యమైనది. ఓదశలో ఇండియా అంటే క్రికెట్, షారుఖ్ మాత్రమే అనేంత ఫాలోయింగ్ సంపాదించాడు. అలాంటి క్రేజ్ ఉన్న షారుఖ్ పై వివాదాలూ ఎక్కువే. షారుఖ్ మతంపై గతంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడూ వచ్చింది. రీసెంట్ గా బిగ్ బీ అమితాబ్ ఇంట్లో జరిగిన దివాలీ సంబరాల్లో భాగంగా హాజరైన షారుఖ్ పై నెట్టింట్లో ఓ వివాదం రాజుకుంది.

 


ఆరోజు కుటుంబంతో సహా పాల్గొన్న షారుఖ్ తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. తనతోపాటు తన పిల్లలిద్దరూ నుదుటిపై బొట్టు పెట్టుకున్న ఫోటో పోస్ట్ చేశాడు షారుఖ్. అదే తప్పైనట్టు.. వరుస కామెంట్లు వచ్చాయి. షారుఖ్ ఇప్పటికైనా నీ మతం ఏంటో చెప్పు.. నువ్వు ఎవరు అంటూ నెటిజన్లు ఆయనకు ప్రశ్నలు సంధించారు. దీంతో ఈ వివాదం రాజుకుంది. దీనికి షారుఖ్ ఖాన్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కానీ బాలీవుడ్ సీనియర్ నటి షబనా ఆజ్మీ దీనిపై స్పందించారు. “షారుఖ్ నుదుటిపై బొట్టు పెట్టుకోవడం తప్పు అన్నట్టుగా కొందరు చేసిన కామెంట్లు చదవడానికే భయంగా ఉన్నాయి. నిజానికి ఇస్లాం ఏమీ బలహీనంగా లేదు. భారతీయ ఆచారాల్లో ఇస్లాం కూడా ఒకటి. భారతీయత అనేది గంగానదీ సంస్కృతిలా అందంగా ఉంది” అంటూ ఆమె షారుఖ్ ను విమర్శించిన వారికి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.

 


దీనిపై కొందరు నెటిజన్లు షారుఖ్, షబనాలకు అండగా నిలిచారు. షారుఖ్ ను ఎప్పుడూ మతపరంగా చూడలేదు, భారతీయుడు షారుఖ్ అంటూ తమ సంఘీభావం తెలిపారు. ఇటువంటి వివాదాలు గతంలో వచ్చినా ఏనాడు షారుఖ్ స్పందించకుండా హుందాతనం పాటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: