నందమూరి నట సింహం బాలకృష్ణ భయపడ్డాడా?  టఫ్ ఫైట్ లో నెగ్గాలనే బాలయ్య కుర్రహీరోతో పోటీకి దిగుతున్నాడా?  ఈ సీనియర్ మాస్ స్టార్ యంగ్ హీరోతో బాక్సాఫీస్ ఫైట్ కు సిద్దమవుతున్నాడు. సంక్రాంతికి ముందే బాలయ్య బాక్సాఫీస్ వద్ద అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. 


నందమూరి బాలకృష్ణ  ఈ ఏడాది ఆరంభంలోనే ఎన్టీఆర్ రెండు పార్ట్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఆ రెండు పార్ట్ లు కూడా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న బాలయ్య మరోసారి కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సిినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి రూలర్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ సంక్రాంతి టఫ్ ఫైట్ నుండి బాలయ్య తప్పుకున్నాడు. 


బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ ల కొత్త సినిమా రూలర్ ను డిసెంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ స్టేట్ మెంట్ ఇచ్చారు. సంక్రాంతి బరిలో మహేష్ బాబు, అల్లు అర్జున్, రజినీకాంత్ లాంటి స్టార్స్ పోటీలో ఉన్నారు. ఇంతటి టఫ్ పైట్ లో ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ బాలయ్య డిసెంబర్ లోనే వచ్చేస్తున్నాడు. అయితే బాలయ్య మెగా యంగ్ హీరో సాయిధరమ్ తో పోటీ తప్పేలా లేదు. 


మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ప్రతిరోజు పండుగే కూడా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రతిరోజు పండుగే సినిమా కంప్లీట్ ప్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. తేజు చిత్రలహరి విజయంతో మంచి స్వీంగ్ లో ఉన్నాడు. ఇప్పుడు మెగా హీరో సిినిమా బాలయ్య రూలర్ పోటీగా వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ పైట్ ఏర్పడనుంది. మరి బాక్సాఫీస్ పైట్ లో మెగా యంగ్ హీరో నెగ్గుతాడా.. నందమూరి స్టార్ గర్జిస్తాడా అనేది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: