తమిళ  డైరెక్టర్  తిరు డైరెక్షన్ లో  మాచో  హీరో గోపిచంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'చాణక్య'.  విడుదలకు ముందు  ట్రైలర్ తో  మంచి  హైప్ నుక్రియేట్ చేసిన ఈ చిత్రం  విడుదల తరువాత మాత్రం  ఘోర పరాజయాన్ని చవిచూసింది.  దసరా కానుకగా  ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రానికి  నెగటివ్ రివ్యూస్ రావడంతో   మొదటి షో నుండే  బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది.  ఫలితంగా  గోపీచంద్  కెరీర్ లోనే ఈ చిత్రం  భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.  ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర , అభిషేక్ అగర్వాల్  ఈసినిమా కోసం సుమారు 30కోట్ల వరకు ఖర్చు పెట్టారు. దీనిలో సగానికి  సగం కూడా  కలెక్ట్ చేయలేకపోయింది.  
 




ఇక ఈసినిమా  నవంబర్ 4న  అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుందని సమాచారం. హై  వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మెహ్రీన్ , కథానాయికగా నటించగా జరీన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషించింది.  ఈ చిత్రం తరువాత  గోపిచంద్ ప్రస్తుతం  సంపత్ నంది  డైరెక్షన్ లో  నటించడానికి  సిద్దమౌతున్నాడు.  వీరి  కాంబినేషన్ లో ఇంతకు ముందు  గౌతమ్ నంద  తెరకెక్కగా  ఆ సినిమా  ఆశించినఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఈ సారైనా వీరిద్దరూ  హిట్ కొడతారో చూడాలి.  స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనున్న  ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించనుండగా నవంబర్ లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.  ఇందులో  బాయ్స్  కబడ్డీ టీం కు కోచ్ గా గోపిచంద్  నటించనుండగా   గర్ల్స్ కబడ్డీ టీం కు కోచ్ గా తమన్నా  కనిపించనుందని సమాచారం. ఈ కబడ్డీ కోచ్  పాత్ర కోసం ప్రస్తుతం తమన్నా తన లుక్ ను మార్చుకొనే పనిలో  వుంది.  యూ టర్న్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: