విక్రమ్ ఏదో ఊహిస్తే మరింకేదో జరిగింది. కొడుకు కోసం పడిన గొడవకు అర్థం లేకుండా పోతోంది. బాలాతో పెట్టుకున్న వైరానికి విలువలేకుండా పోతుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఆదిత్యవర్మ విషయంలో విక్రమ్ తీసుకున్న నిర్ణయం తప్పు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


విక్రమ్ కు డైరెక్టర్ బాలాకి మంచి రిలేషన్ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సేతు, పితగమన్ సినిమాల రిజల్ట్స్ లాగే వాళ్ల ఫ్రెండ్ షిప్ లాగే చాలా స్ట్రాంగ్ అని చెబుతారు. అలాంటిది కొడుకు ధృవ్ కోసం బాలాతో విభేదించాడు. ధృవ్ లాంచింగ్ మూవీ నుంచి బాలాని తప్పించి.. మరో దర్శకుడిని తీసుకునేలా నిర్మాతలపై ప్రెజర్ పెట్టాడని చెబుతారు. 


బాలా దర్శకత్వంలో ధృవ్ హీరోగా అర్జున్ రెడ్డి రీమేక్ మొదలైంది. వర్మ పేరుతో మొదలైన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఆగిపోయింది. బాలా ఒరిజినల్ సోల్ మిస్ చేస్తున్నాడనే కంప్లైయింట్ తో కొత్త దర్శకుడిని తీసుకున్నారు. అర్జున్ రెడ్డికి పనిచేసిన గిరీశయ్యకు దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. గిరీశయ్య ఎంట్రీ ఇచ్చాక వర్మని ఆదిత్యవర్మగా మార్చాడు. హీరోయిన్ మేఘ ప్లేస్ లో బనితా సంధుని తీసుకొచ్చాడు. ఆదిత్యవర్మని అర్జున్ రెడ్డికి జిరాక్స్ లా మార్చేశాడు. దీనిపైనే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. హీరోయిన్ మేఘ యాక్టింగ్ పై విమర్శలు వస్తున్నాయి. ధృవ్ యాక్టింగ్ లో ఏదో మిస్ అయ్యిందని కామెంట్ చేస్తున్నారు. దీంతో విక్రమ్ తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అయ్యిందని మాట్లాడుకుంటోంది కోలీవుడ్. 


విక్రమ్ యాక్టింగ్ గురించి అందరికీ తెలిసిందే. శివపుత్రుడు, అపరిచితుడులో ఆయన యాక్టింగ్ యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. ఆయన వారసుడు సైతం తండ్రి తగ్గ తనయుడిగా రాణిస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. టాలీవుడ్ లో హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను ఆదిత్య వర్మ గా పేరు మార్చేశారు. అందులో అర్జున్ రెడ్డి పాత్రలో విక్రమ్ తనయుడు నటిస్తున్నాడు. అదే హెయిర్ స్టెయిల్, అదే గెడ్డం, అదే సిగరెట్ తో పొగలు చిమ్ముతూ కనిపిస్తున్నాడు. మరి టాలీవుడ్ లో హిట్ అయిన విధంగా ఆదిత్య వర్మ మెప్పిస్తుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: