టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ హాస్య నటి గీతాంజలి (72) కన్నుమూశారు.  గుండెపోటుతో నగరంలోని ఫిలింనగర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో నేడు మృతిచెందారు. ఆమె పార్థీవదేహాన్ని నందినగర్‌లోని నివాసానికి తరలించారు. గీతాంజలి స్వస్థలం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గల కాకినాడ. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో 500కుపైగా సినిమా ఆమె నటించారు.


1947లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గీతాంజలి జన్మించారు.  మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించినా..  ‘సీతారామ కళ్యాణం’ సినిమాతో సీతగా ఎన్టీఆర్‌ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఆమె తనదైన నటనతో మెప్పించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారికి ప్రథమ శిశ్యురాలిగా ఉంటూ వచ్చానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు గీతాంజలి. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవిత విషయాల గురించి ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఎన్టీఆర్‌, సావిత్రిలతో ఆమెకున్న అనుబంధం ఎలాంటిది? మణి.. అనే పేరు గీతాంజలిగా ఎలా మారింది? ఇలా ఎన్నో విశేషాలను తెలిపారు. నన్ను ఇప్పటికీ చాలామంది ఎన్టీఆర్‌గారి సీత అనే పిలుస్తారు. ఆ పాత్రను అంతగొప్పగీ తీర్చిదిద్దింది మహానుభావులు ఎన్టీఆర్ గారే అన్నారు.


మొదటి బి.ఎ. సుబ్బారావు  పిక్చర్‌ లో ‘రాణీ రత్నప్రభ’మూవీ ఓ డ్యాన్స్‌ బిట్‌లో నన్ను చూసిన చూసి ఈ అమ్మాయి ముఖం చాలా అమాయకంగా ప్రత్యేక ఆకర్షణతో ఉందని..అడిగారట ఎన్టీఆర్.  సీత పాత్రకు నప్పుతుంది... ఓసారి మన ఆఫీస్‌కు రమ్మనండి అని చెప్పారట. అంతే అలా ‘సీతారామ కల్యాణం’లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అదే నా జీవితాన్ని పూర్తిగా మార్చింది. మహానటి సావిత్రి తో కూడా ఎంతో సాన్నిహిత్యం ఉండేదని, ఆమె తన సహనటులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే వారిని అన్నారు.  నాకు జమున,వరలక్ష్మి,సూర్యకాంతం ఇలా ఎంతో మంది నటీమణులతో మంచి సాన్నిహిత్యం ఉందని అన్నారు. 


ఇక నా అసలు పేరు మణి..కానీ సినిమాల్లోకి వచ్చాక ‘గీతాంజలి’గా మార్చారు.  దీని వెనుక ఓ కథ ఉందని..హిందీలో ‘పారస్‌మణి’ నా తొలి సినిమా. బాబూభాయ్‌ మిస్త్రీగారు తీశారు.  ఈ మూవీకి ఆయనే కెమెరామన్ గా కూడాచేశారు..అయితే నీ పేరు మణి కాదు ఇక నుంచి నీ పేరు ఠాగూర్‌ గీతాంజలిగా మారుస్తున్నా అని మార్చారు. ఏ ముహూర్తంలో ఆ పేరు పెట్టారో కానీ..అప్పటి నుంచి నా దశ మూర్తిగా మారిపోయింది..వరుసగా సినిమా ఛాన్సులు వచ్చాయి. ఒక్కరోజు మూడు షిఫ్టుల్లో పనిచేసేదాన్ని అని తెలిపారు. 


కాగా, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌కు అదే మొదటి సినిమా.  తర్వాత చంద్రకాంత్‌ దర్శకత్వంలో ‘బలరామశ్రీకృష్ణ’ అనే మరో హిందీ సినిమా చేశాం. అందులో సావిత్రి  బలరాముడి భార్య. నేను శ్రీకృష్ణుడి భార్య రుక్మిణిగానూ చేశాం.  దర్శకుడు. దారా సింగ్‌, సాహుమోదక్‌లు బలరామకృష్ణులుగా నటించిన ఆ సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత హిందీ మూవీస్ లో మళ్లీ నటించలేదని అన్నారు గీతాంజలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: