నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది . ఎందుకంటే ఆయన సినిమాల్లో పవర్ఫుల్ హీరోయిజం  కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ఆయన చెప్పే డైలాగ్ లు అయితే మాటల్లో చెప్పేలేనంత  పవర్ ఫుల్ గా ఉంటాయి. అందుకే బాలయ్య బాబు సినిమా వస్తుందంటే నందమూరి అభిమానుల్లో  ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన సినిమాల్లో హీరోయిజం మాటలకందని విధంగా ఉంటుంది. ఇప్పటికే లెజెండ్ సింహ లాంటి సినిమాల్లో ... పవర్ ఫుల్ డైలాగ్ లతో నందమూరి అభిమానులను ఉర్రూతలూగించాడు నందమూరి బాలకృష్ణ. ఇక ఇప్పుడు తాజాగా రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో రూలర్ సినిమా తెరకెక్కించ పడుతుంది. 



 భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ  సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది  చిత్ర బృందం. సినిమా యూనిట్ విడుదల చేసిన బాలయ్య ఫస్ట్ లుక్ చూస్తుంటే... బాలయ్య కెరీర్ లో మరో సింహ లెజెండ్ లాంటి సినిమా  రాబోతున్నట్లు అర్థమవుతుంది. అంతేకాకుండా బాలయ్య ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించనంత డిఫరెంట్ లుక్ తో కూడా కనిపిస్తున్నారు. దీంతో బాలయ్య రూలర్ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా రూలర్ సినిమాలో  బాలకృష్ణ రెమ్యునరేషన్ గురించి కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 



 రూలర్ సినిమా కోసం బాలకృష్ణ తన రెమ్యునరేషన్ని డబుల్ చేశారని... అయినప్పటికీ నిర్మాత బాలయ్యకు అడిగినంత రెమ్యునరేషన్ కట్టబెట్టారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి తాజాగా నిర్మాత సీ. కళ్యాణ్  స్పందించారు. బాలకృష్ణ గారు ఎప్పుడు పారితోషికం గురించి ఆలోచన చేయరని... రూలర్  సినిమా కోసం ఆయన ఎక్కువ పారితోషికం అడిగారు అనేది  అవాస్తవమని... అసలు తాము ఇప్పటి వరకు రెమ్యునరేషన్  గురించి చర్చలు జరపలేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత సి.కళ్యాణ్. బాలకృష్ణ గారు తమకు ఇస్తున్న సహకారంతోనే సినిమాని అనుకున్న తేదీలోపు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని ఆయన తెలిపారు. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ వేదిక కనిపించనుండగా... ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: