ఎక్కడైనా కూడా పెళ్లి కోసం ఏ పంతులునో ఏ మ్యారేజ్ బ్యురోనో కలుస్తారు. లేదా తెలిసినవాళ్లు సంబంధం అని పెళ్లిళ్లు జరుగుతుంటాయి. కానీ, ఎక్కడ పెళ్లిళ్ల సీజన్ వచ్చింది నన్ను తప్పక అడగండి అంటూ ఓ బాలీవుడ్ స్టార్ హీరో అంటున్నారు. అయన ఎవరో కాదు.. బాలీవుడ్ దూకుడు స్టార్ హీరో రణవీర్ సింగ్. రణ్‌వీర్ సింగ్ అభిమానుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించాడు. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. నవంబర్‌లో బోలెడు ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు.


నవంబర్ లో పెళ్లిళ్లు సీజన్ అంటే హడావిడి ఏ రేంజులో ఉంటుందో వేరేలా చెప్పనక్కర్లేదు. రణవీర్ 83 సినిమా కోసం దర్బార్ గబ్బర్ సింగ్ లాగ మీసం పెంచారు. సినిమా షూట్ అయిపోవడంతో ఈ మీసం తీసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అమ్మాయిలు పోస్ట్ చేస్తేనే ఇదొక క్యాప్షన్ పెడతారు అలాంటిది నేను పెడితే తప్పేంటి అని కామెడీ క్యాప్షన్ పోస్ట్ చేసాడు. 

మరో విషయమేంటే.. ఈ పోస్ట్ కు రణవీర్ భార్య దీపికా పాడుకొనే ఇచ్చిన కామెంట్ మాత్రం బాగా హైలెట్ అవ్వడమే కాదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.  రణ్‌వీర్ క్యాప్షన్‌పై ఎందరో సినీ ప్రముఖులు స్పందించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ స్పందిస్తూ.. ‘నువ్వు చాలా చీప్’ అన్నాడు. అనుపమ్ ఖేర్ స్పందిస్తూ.. ‘ఫొటోలో నువ్వు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూసి కూడా నిన్ను సంప్రదించాడంటే వాడికి ఎంతో గట్స్ ఉండి ఉండాలి’ అన్నారు. కరణ్ ఈ విషయంపై స్పందిస్తూ మాకు పెళ్లిళ్లు అవసరం లేదు పెళ్లి కొడుకే కావలి అంటూ కామెంట్ చేసాడు. 


రణవీర్ సినిమాల విషయానికొస్తే.. కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తున్నారు. ఆ సినిమానే  ‘83’ అనే టైటిల్‌ను పెట్టారు. ఇందులో రణ్‌వీర్ కపిల్ దేవ్ పాత్రలో నటించారు. కపిల్ భార్య రోమీ దేవ్ పాత్రలో రణ్‌వీర్ భార్య దీపిక పదుకోన్ నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఐదో సినిమా ఇది. రణవీర్ పెళ్లైయ్యాక తొలిసారి జరుపుకున్న దీపావళికి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: