తెలుగులో తమిళ అమ్మాయిల హవా ఇప్పటి నుండి కాదు.. కనిపించడానికి టాలీవుడ్, బాలీవుడ్ రెండు పరిశ్రమలైనా సరే హీరోయిన్స్ విషయంలో అక్కడి వారు ఇక్కడ.. ఇక్కడ వారు అక్కడ సినిమాలు చేస్తారు. ముఖ్యంగా తమిళ హీరోయిన్స్ కు తెలుగులో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. తెలుగు పరిశ్రమను ఒక ఊపు ఊపిన త్రిష, సమంతలు చెన్నై నుండి వచ్చిన భామలే.


ఇక ఇప్పుడు అదే తరహాలో తన సత్తా చాటాలని చూస్తుంది నివేదా పేతురాజ్. 2016 ఒరు నాల్ కొత్తు సినిమాతో వెండితెర తెరంగేట్రం చేసిన నివేదా పేతురాజ్ తెలుగులో మెంటల్ మదిలో సినిమాతో హీరోయిన్ గా నటించింది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఆ సినిమాలో నివేదా నటనకు మంచి మార్కులు పడ్డాయి. 


ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించి మెప్పించిన నివేదా పేతురాజ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో కూడా స్పెషల్ రోల్ చేస్తుంది. ఈ సినిమాతో తెలుగులో టాప్ రేంజ్ కు వెళ్లాలని చూస్తుంది నివేదా. లేటెస్ట్ గా అమ్మడు తన క్యూట్ ఫోటోస్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.


సరైన ఛాన్స్ రావాలే కాని తానేంటో చూపిస్తా అనేలా అమ్మడు చెప్పకనే చెబుతుంది. అందం అభినయం రెండు ఉన్న నివేదా పేతురాజ్ తప్పకుండా తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. బన్ని సినిమాలో ఆమె క్లిక్ అయితే కనుక ఆమెకు వరుస ఛాన్సులు రాక మానదు. మరి నివేదా పేతురాజ్ టాలీవుడ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.  కోలీవుడ్ లో కూడా నివేదా పేతురాజ్ వరుస సినిమాలు చేస్తుంది. తమిళంలో అమ్మడు 3 సినిమాలు చేస్తుంది. కోలీవుడ్ లో నివేదా కెరియర్ కు తిరుగులేదు.. అదే ఫాంను తెలుగులో కూడా కొనసాగించాలని చూస్తుంది. 


  



మరింత సమాచారం తెలుసుకోండి: