టాలీవుడ్ లో దర్శకేంద్రుడి సినిమాలకి అదో ప్రత్యేకమైన క్రేజ్. ఆయన సినిమాల్లో  తెలుగుదనం ఉట్టిపడటమే  కాదు... హీరోయిన్లకి సరికొత్త అందాలను తెచ్చే విధంగా ఆయన మేకింగ్  ఉంటుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సినిమా అంటేనే పూలు పండ్లు అని అందరూ భావిస్తారు. ఇక దర్శకేంద్రుడి కి ఏ హీరోయిన్ ను  ఎంత అందంగా చూపించాలి... ఏ యాంగిల్స్ లో  చూపిస్తే అందంగా ఉంటారో దర్శకేంద్రుడికి  బాగా తెలుసు. దర్శకేంద్రుడు సినిమాల్లో  ప్రతి  హీరోయిన్ ఓ ముద్దబంతి పువ్వు... ప్రతి కథానాయక ఒక కాశ్మీర్ ఆపిల్. హీరోయిన్ల అందాలకు మల్లె పూలు పండ్లను జతచేసి ఆయన సరికొత్త అందాన్ని రూపుదిద్దాడు. రాఘవేంద్రరావు తెరకెక్కించే  సినిమాల్లో  కథ కథనంతో పాటు మ్యూజిక్ కి  కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు.  ఆయన సినిమాల్లో హీరోయిన్ ని  శృంగార దేవత గా చూపించడం ఆయన స్టైల్ . అందుకే తెలుగు ప్రేక్షకుల్లో  రాఘవేంద్రరావు సినిమా వస్తుందంటే అదొక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. 



 అయితే ఎందరో హీరోహీరోయిన్ల కెరియర్ లు  మలుపుతిప్పే సినిమాలను సైతం రాఘవేంద్రరావు  నిర్మించారు. ప్రస్తుత టాప్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సైతం తన కెరీర్ కు  బాటలు వేసేలా  మొదటి సినిమానే  విజయం సాధించేలా తెరకెక్కించారు  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఇక దర్శకేంద్రుడు సినిమాలో  పాటలు అదరహో అనేలా ఉంటాయి. కేవలం సినిమాల్లో పాటల గురించి  సినిమా చూసే  అభిమానులు ఎంతో మంది. ముఖ్యంగా హీరోయిన్స్ నాభిపై పూలు పండ్లు వేసే సీన్లు   తెగ ఫేమస్ అయ్యాయి . అందుకె  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అనగానే పూలు పండ్లతో మేకింగ్ గుర్తొస్తుంది. ఇక తాజాగా  ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే  ప్రోగ్రాంలో పాల్గొన్నాడు  రాఘవేంద్రరావు . ఈ సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అలీ  అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర  సమాధానాలు చెప్పాడు దర్శకేంద్రుడు. 



 దర్శకేంద్రుడు సినిమాలలో ఇప్పుడు వరకు ఎన్నో పూలు పండ్లు పడిన  సన్నివేశాలు  చూసాం . అయితే మీరు ఇప్పుడు వరకు వాడని పండు ఏమిటి అని అలి దర్శకేంద్రుణ్ణి  ప్రశ్నించారు. దానికి దర్శకేంద్రుడు నవ్వుతు  ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూ కి వెళ్లిన ఇలాంటి ప్రశ్న నన్ను అడుగుతారని ఆయన తెలిపారు. ఎందుకంటే ఆయా సన్నివేశాలు పాటలు ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాయని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెలిపారు. అయితే ఈ సందర్భంగా సమాధానం చెప్పిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తాను  ఇప్పుడు వరకు హీరోయిన్స్ పై వాడి పండు ఉందంటే అది ఒక్క పనస పండు మాత్రమే అని సమాధానమిచ్చారు. అంతేకాకుండా చెట్టునుంచి ఆపిల్ పడినప్పుడు న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెడితే... నేను ఆ యాపిల్ పండు హీరోయిన్పై ఎక్కడ పడాలో  కనిపెట్టాను అంటూ  దర్శకేంద్రుడు చమత్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: