15 మంది సభ్యులతో మొదలైన బిగ్ బాస్ 3 తెలుగు చివరి ఘట్టానికి చేరుకుంది. ఎన్నో ఒడిదుడుకుల తో మొదలైన కంటెస్టెంట్స్ ప్రయాణం చివరికి ఒక కొలిక్కి వచ్చింది. 12 మంది ఇంటి సభ్యులు ప్రతి వారం ఒక్కొక్కరిగా ఎలిమినేట్ కాగా వారిలో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోనికి వచ్చారు. చివరికి ఇప్పుడు ఐదుగురు సభ్యులు టైటిల్ కోసం నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. వారే రాహుల్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ మరియు అలీ రెజా.

ఇకపోతే దాదాపు వంద రోజులు పైగా ఇంటి లోపల జరుగుతున్న సంఘటనలు మరియు ప్రతి ఒక్కరు ఆడుతున్న గేమ్ ను నిశితంగా పరిశీలించిన ప్రేక్షకులు ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఎవరో ఒక అంచనాకి వచ్చేశారు. సోషల్ మీడియాలో ఓటింగ్ జరుగుతున్న పద్ధతి మరియు ఓట్లు పోల్ అవుతున్న విధానం చూస్తుంటే ఈసారి రాహుల్ సిప్లిగంజ్ కే బిగ్ బాస్ టైటిల్ అని అందరూ అనుకుంటున్నారు. అయితే అతనికి కూడా ఇది అంతా సులభంగా దక్కకబోవడం లేదని సమాచారం. శ్రీముఖి నుంచి రాహుల్ కి గట్టి పోటీ ఎదురుకానుంది.

అయితే ప్రస్తుతం ఇంట్లో ఉన్న వాతావరణం మరియు జరుగుతున్న పరిణామాల ప్రకారం ఒకే ఒక్క మహిళా ఇంటి సభ్యురాలైన శ్రీముఖి ఫైనలిస్తులుగా నిలిచే ఇద్దరిలో ఒకరిగా నాగార్జున పక్కన నిల్చుంటుందని అని సమాచారం. ఇకపోతే వరుణ్ సందేశ్ మరియు రాహుల్ లలో ఒకరు శ్రీముఖి తో పాటు ఫైనలిస్ట్ గా ఉండబోతున్నారట. కాబట్టి దాదాపుగా గెలిచే అవకాశాలు శ్రీముఖి, రాహుల్ మరియు వరుణ్ సందేశ్ మధ్యలోనే ఉన్నాయి. ఇకపోతే బాబా భాస్కర్ మరియు అలీ రెజా ఫైనలిస్టు లుగా నిలబడాలి అంతే రానున్న రెండు రోజుల్లో చాలా అసాధారణంగా తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది.

మొత్తానికి వస్తున్న సమాచారం ప్రకారం అయితే రాహుల్ దాదాపుగా ఈ సీజన్ టైటిల్ కొట్టేసినట్టే అని అంతా అనుకుంటున్నారు. ఇదే విషయమై బిగ్ బాస్ నిన్న అతని జర్నీ వీడియో ప్లే చేసినప్పుడు రాహుల్ని అందరికంటే ఎక్కువగా కొనియాడిన విషయం మర్చిపోవద్దు.


మరింత సమాచారం తెలుసుకోండి: