తెలుగు లో ఎన్నో హాస్య పాత్రల్లో నటించి తనదైన మార్క్ చాటుకున్న ప్రముఖ నటి గీతాంజలి గుండెపోటుతో హైదరాబాద్, జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన గీతాంజలి.. సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు. తెలుగులో ఆమె మొదటి సినిమా ‘సీతారామ కళ్యాణం’.  ఈ సినిమాలో ఆమె అభినయానికి మెచ్చిన ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల్లో ఛాన్సు ఇచ్చారు. 

అప్పటి నుంచి ఎన్టీఆర్ ని పెద్దయ్యా అని పిలుస్తూ తన గురువుగా భావించారు గీతాంజలి. తాజాగా గీతాంజలి మరణ వార్త విన్న ప్రముఖ నటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షాక్ కి గురైనట్లు తెలిపారు. ఆమెకు తమ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని, తన తండ్రి ఎన్టీఆర్ అంటే గీతాంజలి గారు ఎంతో అభిమానం చూపేవారని వెల్లడించారు. సెట్స్ లోనే కాదు ఆమె ఎక్కడ కలిసినా తమ తమ కుటుంబం పట్ల చూపించే ఆభిమానం ఎప్పటికీ మర్చిపోలేనిదని అన్నారు. సొంత మనిషిలా మమ్ముల్ని పలకరించేవారని అన్నారు.

ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘సీతారామ కల్యాణం’ సినిమాలోలో గీతాంజలి సీత పాత్ర పోషించారని, నటనలో ఆమె ఎన్టీఆర్ నే స్ఫూర్తిగా తీసుకునేవారని వివరించారు. ఇప్పుడామె అందరినీ వదిలి వెళ్లిపోవడం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు.  గీతాంజలి మృతి విషయం తెలిసి టాలీవుడ్ నిర్ఘాంతపోయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్నా ప్రార్థిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: