టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు మాదిరిగా తనకు సినిమాలు లేకుండా ఏ మాత్రం అవకాశం దొరికినా సరే, హ్యాపీగా భార్య స్నేహ మరియు పిల్లలు అయాన్, అర్హ లతో కలసి హాయిగా విదేశాలకు వెకేషన్ కు వెళ్లిపోతుంటారు. ఇక ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి పలుమార్లు విదేశాలకు వెళ్లివచ్చిన బన్నీ, మూడు రోజుల క్రితం వారితో కలిసి ఎంతో ఘనంగా దీపావళి వేడుకలు కూడా జరుపుకోవడం జరిగింది. ఇకపోతే నేడు విదేశాల్లో ఎంతో వేడుకగా జరుపుకునే హాలోవీన్ పండుగను పురస్కరించుకుని బన్నీ కొడుకు మరియు కూతురు కలిసి ఎంతో వెరైటీగా కొంత విచిత్రమైన డ్రెస్సులు ధరించి రకరకాల ఫోజుల్లో ఫోటోలు దిగడం జరిగింది. 

అయితే భార్య స్నేహతో కలిసి బన్నీ కూడా ఈ సరదాగా వేడుకలో పాల్గొన్నట్లు చెప్తున్నారు. ఎప్పటికపుడు తన పిల్లలతో కలిసి సరదా ఫన్నీ వీడియోలు మరియు ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసే బన్నీ, ఈ ఫోటోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ ఫోటోలు అలా సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయో లేదో, వెంటనే మెగా ఫ్యాన్స్ వాటిని విపరీతంగా లైక్స్ మరియు షేర్స్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు. అంతేకాక ఆ ఫొటోల్లో బన్నీ కూతరు మరియు కొడుకు ఎంతో వెరైటీగా చూడడానికి పిల్ల దెయ్యాల్లా ఎంతో అందంగా ఉన్నారు అంటూ ఫన్నీగా వారిపై కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. 

ఇక ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలవైకుంఠపురములో సినిమాలో హీరోగా నటిస్తున్న బన్నీ, ఇప్పటివరకు తామిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి మరియు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలను మించే విధంగా ఈ సినిమా సక్సెస్ సాధించాలని ఎంతో కసిగా నటిస్తున్నట్లు టాక్. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: