ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి ఆఫర్లతో దూసుకెళ్తున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. నాగశౌర్య సరసన ఆమె నటించిన తొలి సినిమా ఛలో మంచి హిట్ సాధించడం, ఆ తరువాత యువ సెన్సేషనల్ హీరో విజయ దేవరకొండతో ఆమె నటించిన గీత గోవిందం కూడా మరింత అద్భుత విజయాన్నిఆ అందుకోవడంతో రష్మికకు వెల్లువలా ఆఫర్లు మొదలయ్యాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ప్రక్కన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు నేడు పలు ఫిలిం నగర్ వర్గాల నుండి వార్తలు విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి మొదట ఈ సినిమాలో కొమరం భీంగా నటిస్తున్న ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఎడ్గార్ జోన్స్ ని ఆర్ఆర్ఆర్ టీమ్ ఎంపిక చేసారు. అయితే కొన్ని అనుకోని కారణాల వలన ఆమె ఈ సినిమాలో నటించలేనని చెప్పడంతో, అప్పటి నుండి వేరొక హీరోయిన్ వేటలో పడ్డారు ఆర్ఆర్ఆర్ యూనిట్. 

ఇక నేడు వారందరూ కలిసి రష్మికకు ఓటేసినట్లు టాక్ వినపడుతోంది. అయితే ఈ విషయం రెండు రోజుల క్రితం ద్రువీకరించబడిందని, అయితే దీనిపై మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే అల్లూరిగా నటిస్తున్న రామ్ చరణ్ మరియు ఆయనకు హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ మధ్య సన్నివేశాలు ఆల్రెడీ చిత్రీకరించిన రాజమౌళి, ఇకపై కొమరం భీంగా నటిస్తున్న ఎన్టీఆర్ కు మరియు ఆయన సరసన నటించబోతున్న రష్మికకు మధ్య సీన్స్ తీయనున్నట్లు టాక్. మరి ప్రస్తుతం విరివిగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, రష్మిక రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: