ఇదేంటి టైటిల్ కొంచెం తేడాగా ఉంది అని అనుకుంటున్నారా..? నిజమే విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్ ను సంపాదించిన అర్జున్ రెడ్డి సినిమాలో అడల్ట్ కంటెంట్ చాలానే ఉంది. అయితే సున్నితమైన భావోద్వేగాల కు దానిని జోడించి సక్సెఫుల్ గా హిట్ ట్రాక్ వైపు నడిపించాడు సందీప్ రెడ్డి వంగా. అయితే అదే కంటెంట్ కాస్తా ఇప్పుడు విజయ్ కి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. 

సైరా తర్వాత బాక్సాఫీస్ సినిమాల హవా లేకుండా బోసిపోయింది. అయితే విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి... దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా' రేపు థియేటర్ల దగ్గర సందడి చేయనుంది. కానీ ఈ చిత్రానికి కొన్ని చిత్రాల దగ్గర నుంచి భారీ ముప్పు పొంచి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ జరిగినది ఏమిటంటే రేపు విడుదలవుతున్న ఆవిరి, శ్రీమతి 21ఎఫ్ మరియు మరీ ముఖ్యంగా 'ఏడుచేపలకథ' సినిమాలకు సంబంధించిన పోస్టర్లు దాదాపుగా రాష్ట్రం నలుమూలల గోడలపై కనిపిస్తున్నాయి.

అసలే అడల్ట్ కంటెంట్ అంటే వెర్రెత్తి పోయే యూత్ ఇక గోడలపై ఆ పోస్టర్లను చూసి ఆగగలరా మీరే చెప్పండి..? దీంతో కచ్చితంగా కొన్ని ఏరియాలలో విజయ్ దేవరకొండ సినిమా కన్నా ఈ సినిమాలో మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పొరపాటున వాటిలో ఏ ఒక్క సినిమాకైనా మంచి రివ్యూలు లేదా పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది అంటే ఇక అంతే... సినిమాలు బి,సి మరియు మాస్ సెంటర్స్ లో పెకాడేసస్థాయి.

నిర్మాతగా ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న విజయ్ దేవరకొండకు కోలుకోలేని దెబ్బ మిగులుస్తాయి. మల్టీప్లెక్ష్లలో  'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో ఉన్న కామెడీ కంటెంట్ వల్ల భారీగా లాభపడనుండగా బి, సి సెంటర్ల ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోవడంలో మరియు మూడు చిత్రాలు ఇప్పటికే తమ వంతు ప్రయత్నం చేసేశాయి. ఇక ఫలితం రేపు ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: