బిగ్ బాస్ సీజన్ 3 మరో మూడు రోజుల్లో ఎవరు విన్నర్ అన్నది తెలుస్తుంది. ఫైనల్ వీక్ లో ఐదుగురు ఇంటి సభ్యులు ఉండగా వారిలో ఒక్కరికే టైటిల్ దక్కుతుందని తెలిసిందే. అయితే ఉన్న ఐదుగురిలో ఈ టైటిల్ రేసులో మాత్రం ముగ్గురు మధ్య టఫ్ ఫైట్ జరుగుతుందని తెలుస్తుంది. శ్రీముఖి, రాహుల్, వరుణ్ ఈ ముగ్గురిలోనే విన్నర్ ఉంటాడని తెలుస్తుంది.


అయితే రాహుల్, శ్రీముఖిలకు సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ ఉందని హంగామా చూస్తేనే తెలుస్తుంది. సింగర్ గానే కాదు ప్రైవేట్ ఆల్బమ్స్ తో రాహుల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. దానితోనే మొదటి నుండి అతను సరిగా టాస్కులు ఆడకున్నా సరే నామినేషన్స్ లో ఉన్నా ఎలిమినేట్ అవకుండా ఉన్నాడు.


ఇక శ్రీముఖి విషయానికి వస్తే బుల్లితెర యాంకర్ గా సత్తా చాటుతున్న శ్రీముఖి బిగ్ బాస్ హౌజ్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉంది. అయితే హీరో వరుణ్ తన భార్య వితికతో బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చాడు. మొదటి నుండి హౌజ్ లో తన మార్క్ చూపిస్తున్న వరుణ్ టైటిల్ విన్నర్ గా గెలిచే అవకాశం ఉందని నిరూపించుకున్నాడు.   


రాహుల్, శ్రీముఖిల మధ్య పోటీ ఉన్నది నిజమే కాని చాప కింద నీరులా వరుణ్ సందేష్ కూడా టైటిల్ రేసులో తప్పకుండా ఉంటాడని మాత్రం చెప్పొచ్చు. రాహుల్, శ్రీముఖి ఫ్యాన్స్ గొడవపడి మధ్యలో వరుణ్ కు టైటిల్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే టైటిల్ విజేతగా వరుణ్ ఓ విధంగా అర్హుడనే చెప్పొచ్చు. మరి ఓటింగ్స్ ఎలా ఉన్నాయో చూడాలి. తప్పు చేస్తే భార్య అయినా సరే వితిక మీద గొడవకు దిగాడు వరుణ్.. మరి ప్రేక్షకుల ఆమోదం కూడా అతనికి లభిస్తుందా లేదా అన్నది చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: