టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్ నుండి చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ అనతికాలంలోనే చిరంజీవి స్థాయికి ఎదిగి మెగా అభిమానులు కాలర్ ఎగరేసల సినిమాలు చేసి రికార్డు సృష్టించి అతి తక్కువ సమయంలోనే మంచి స్టార్ డమ్ సంపాదించి తనకంటూ సపరేట్ మార్కెట్ ఇండస్ట్రీలో ఏర్పరచుకున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క తనవంతుగా చాలా ప్రజా సమస్యల విషయంలో అప్పట్లో హీరోగా రాణిస్తూనే పవన్ కళ్యాణ్ సామాజిక సేవ వ్యక్తిగతంగా చేసేవాళ్లు. ఇటువంటి నేపథ్యంలో 2014వ సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2018లో పూర్తిగా సినిమాలకు దూరం అయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు.


ఇటువంటి నేపథ్యంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగానే అబ్బాయ్ రామ్ చరణ్ కూడా తనవంతుగా భవిష్యత్తులో వ్యవహరించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శమని సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా బాబాయ్ పవన్ అంటే చాలా ఇష్టం అంటూ రాంచరణ్ వెల్లడించిన సందర్భాలు ఉన్నాయ్. కాగా తాజాగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగే తాను కూడా ఒక గోశాల ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు.


దీనికిగాను ఇంస్టాగ్రామ్ లో  “తాను కూడా త్వరలోనే గోశాలను ప్రారంభించబోతున్నాను.. హ్యాపీ కార్తికమాసం” అంటూ రాంచరణ్ పోస్ట్ పెట్టారు. దీంతో మెగా అభిమానులు ఈ పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన పొలంలో పశువుల తో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తూ వాటికి అరటిపళ్ళు పెడుతూ ఆడుకుంటూ మరోపక్క మొక్కలు నాటి వాటికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయడంతో దానికిగాను రామ్ చరణ్ పై విధంగా గోశాల భవిష్యత్తులో పెట్టడానికి రెడీ అవుతున్నట్లు స్పష్టం చేశారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: