ఈమధ్య కోలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోవడం లేదు. రజినికాంత్, కమల్ హాసన్ వంటి వారి సినిమాలే లైట్ తీసుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు. అయితే సూర్య, కార్తిల సినిమాలకు ఒకప్పుడు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. కాని వారిద్దరు కూడా ఈమధ్య వెనుకపడ్డారు.


ఇదిలాఉంటే అన్న సూర్యా కన్నా తమ్ముడు కార్తి తెలుగులో చాలారోజుల తర్వాత ఓ సూపర్ హిట్ కొట్టాడు. లాస్ట్ ఫ్రై డే రిలీజైన ఖైది సినిమాతో కార్తి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సాంగ్స్, హీరోయిన్, రొమాన్స్ వంటి అంశాలకు తావివ్వకుండా సినిమా తీశారు.


అయినా సరే సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా బి, సి సెంటర్ ఆడియెన్స్ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన లోకేష్ కనగరాజ్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఖైది హిట్ అని తెలియగానే ఇళయదళపతి విజయ్ పిలిచి ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది.


ఇక మరోపక్క తమ్ముడితో హిట్ కొట్టిన ఈ దర్శకుడితో తాను కూడా సినిమా చేయాలని చూస్తున్నాడు సూర్య. విజయ్ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ సూర్య సినిమానే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్తితో హిట్ కొట్టిన లోకేష్ విజయ్, సూర్యలతో ఆ హిట్ మేనియా కొనసాగిస్తాడేమో చూడాలి. తెలుగులో కొన్నాళ్లుగా తమిళ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుండగా కార్తి ఖైది మాత్రం మంచి వసూళ్లు రాబడుతుంది. పోటీగా విజయ్ విజిల్ సినిమా వచ్చిన సరే తెలుగులో మాత్రం కార్తి ఖైదికే మంచి కలక్షన్స్ వస్తున్నాయని తెలుస్తుంది. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: