పెళ్లిచూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా వాణి భోజన్, అభినవ్ గోమఠం ముఖ్య పాత్రల్లో విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం మీకు మాత్రమే చెప్తా. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమాకు దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించాడు. విజయ దేవరకొండ ఈ సినిమాను నిర్మించటం, ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. 
 
తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో రాకేశ్ అనే పాత్రలో నటించాడు. రాకేశ్ తన ప్రేయసిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైన సమయంలో అతనికి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో బయటకు వస్తుంది. ఆ వీడియో వైరల్ కాకుండా ఉండటానికి రాకేశ్ అతని స్నేహితులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఆ వీడియోను పంపిన వ్యక్తి ఎవరు ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. 
 
మీకు మాత్రమే చెప్తా సినిమాకు కామెడీ మేజర్ హైలెట్ అని చెప్పవచ్చు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఏం జరగబోతుంది అనే ఉత్కంఠను కలిగిస్తాయి. అనసూయ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ అద్భుతంగా ఉంది. సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటులందరూ అద్భుతంగా నటించారు. కథనం కొన్నిచోట్ల నెమ్మదిగా అనిపించినా కామెడీ సన్నివేశాలు బాగా ఉండటంతో సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టదు. 
 
ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా తొలి సినిమాతో మంచి హిట్ కొట్టాడని చెప్పవచ్చు. తరుణ్ భాస్కర్ రాకేశ్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ వాణి భోజన్ పాత్రకు తగినట్లు నటించింది. వీడియోకు సంబంధించిన ట్రాక్ ను దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ అద్భుతంగా తీర్చిదిద్దాదు. తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించటంతో నిర్మాత విజయ్ దేవరకొండకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: