కీర్తి సురేష్ దక్షిణాది స్టార్ కథానాయకల్లో కీర్తి ఒకరు . ఇక తెలుగు ప్రేక్షకుల్లో కీర్తి సురేష్ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి లో కీర్తి సురేష్ నటించిన సావిత్రమ్మ పాత్రలో జీవించింది. మహానటి తో కీర్తి సురేష్ స్టార్డం ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు వరకు సాదాసీదా హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ మహానటి సినిమా తో స్టార్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. మహానటి లో ఆమె నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మహానటి సినిమాకి గాను కీర్తి సురేష్ కి జాతీయ పురస్కారం కూడా లభించింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో నేను శైలజ మూవీ లో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి  సురేష్... ముందుగా గ్లామర్ పాత్రలు  చేస్తున్నట్టు కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది. 



 ఇక మహానటి సినిమా తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తుంది ఈ అమ్మడు. కాగా తాజాగా మీడియాతో మాట్లాడిన కీర్తి సురేష్ తన పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ఇంట్లో ప్రేమ వివాహం సహజమే... మా అమ్మానాన్నలది కూడా ప్రేమ వివాహమే... అంతేకాకుండా మా సిస్టర్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంది అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. ఈ సందర్భంగా తన పెళ్లిపై స్పందిస్తూ... తాను  ప్రేమ పెళ్లి చేసుకుంటానో  లేదో  తెలియదు కానీ... లవ్ చేయడం మాత్రం తప్పు కాదు అంటోంది ఈ అమ్మడు. 



 ప్రేమ పై తనకు గౌరవం ఉందని... కాని తనకు ప్రస్తుతం పెళ్లి పైన దృష్టి లేదని... తనకు కాబోయే వాడు ఎలా ఉండాలనే ఆలోచన కూడా లేదని... ప్రస్తుతం తన దృష్టంతా తన కెరీర్ పైనే ఉందని కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ మిస్ ఇండియా లో నటిస్తుంది. కీర్తి నటిస్తున్న మిస్ ఇండియా సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు నవీన్ చంద్ర జగపతిబాబు నరేష్ రాజేంద్ర ప్రసాద్  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా కీర్తి స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే  సినిమాలో కూడా నటిస్తోంది. నరేష్ కుకూనూర్  డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కీర్తి ఫస్ట్ లుక్  రీసెంట్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు బొద్దుగా ముద్దుగా ఉండే కీర్తి సురేష్ ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ లో సన్నగా మారి స్టైలిష్ లుక్ తో  అదరగొట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: