ఇక ఫైనల్ దశకు బిగ్ బాస్ సీజన్ 3 చేరుకుంటున్న నేపథ్యంలో ఇంటిలో ఉన్న తమ అభిమాన కంటెస్టెంట్ లను గెలిపించుకోవడానికి సోషల్ మీడియాలో సపోర్టర్స్ బాగా కష్ట పడుతున్నారు. ప్రేక్షకుల చేత ఓటింగ్ వేయించడానికి రకరకాలుగా వీడియోలు క్రియేట్ చేస్తూ ఇంటిలో ఉన్న తమ అభిమాన కంటెస్టెంట్ కి ఎలాగైనా ఓట్లు పడేలా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఇదే క్రమంలో ఇంటిలో కంటెస్టెంట్ ఇంటి సభ్యులు కూడా సోషల్ మీడియాలో ప్రచారానికి తెర లేపారు. ఇప్పటికే శ్రీముఖి తండ్రి రామకృష్ణ గారు వీడియో చేసి శ్రీముఖి ని గెలిపించాలని ప్రచారం చేస్తుండగా మరోపక్క శ్రీముఖి టెలివిజన్ రంగం నుండి సెలబ్రిటీల మద్దతు గట్టిగా ఉండటంతో వాళ్లు కూడా శ్రీముఖి ని గెలిపించాలని వీడియో లు క్రియేట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు.


ఇక హీరో వరుణ్ సందేశ్ టైటిల్ కలవడానికి అన్ని విధాల అర్హత ఉందని ఇంటి నుండి ఎలిమినేట్ అయిన వరుణ్ సందేశ్ భార్య వితిక ప్రచారం చేస్తోంది. మిగిలిన కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉండగా రాహుల్ సిప్లిగంజ్ తల్లి ఏ ఎమోషనల్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాహుల్ బిగ్ బాస్ హౌస్ లో ఇంత దూరం వచ్చాడంటే అందుకు కారణం అతడి నిజాయతీ, ముక్కు సూటితనం అని చెప్పింది.


ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రాహుల్ కు ఓట్ చేసి అతడిని గెలిపించండి అని ఆమె ప్రేక్షకులని కోరింది. ఇదే క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజల్లో రాహుల్ గెలవాలని ఎటువంటి కన్నింగ్ గేమ్ ఆడకుండా ముక్కుసూటిగా మాస్కులు లేకుండా ఇంటిలో రాణించింది కేవలం రాహుల్ మాత్రమే అంటూ రాహుల్ టైటిల్ గెలవటానికి అన్ని విధాల అర్హతలు ఉన్నాయని...రాహుల్ ని గెలిపించాలని కామన్ పీపుల్ కోరుతున్నారు. మరి టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: