రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయింది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి నాన్ బాహుబలి రికార్డులను పగలగొట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. రామ్ చరణ్ కెరియర్ లోనే మగధీర తరహాలో హిట్ సాధించింది రంగస్థలం సినిమా. తమిళ్ మలయాళం భాషలలో రిలీజైన పెద్దగా అలరించలేకపోయింది.అయితే తెలుగులో దాదాపు 200 కోట్ల గ్రాస్  100 కోట్ల షేర్ వ‌సూళ్ల‌తో సరికొత్త రికార్డులు న‌మోదు చేయటం కొరియోగ్రాఫ‌ర్ కం ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్ ఎట్రాక్ట్ చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తోంది.


విషయంలోకి వెళితే ఈ సినిమా తమిళంలో రీమేక్ చేయడానికి రీమేక్ రైట్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ దగ్గర దాదాపు కోటిన్నర పెట్టి రంగస్థలం రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్లు ఈ సినిమానే తమిళ్లో డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు ఈ సినిమాలో లారెన్స్ హీరోగా చేయబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. లారెన్స్ సినిమాలు అంటే చాలా మాస్ గా ఉంటాయి. దీంతో రంగస్థలం సినిమాని సైతం మరీ నాటుగా, ఊర మాస్ గా మార్చేస్తారని రంగస్దలం అభిమానులు కంగారుపడుతున్నారు.


కొందరైతే సోషల్ మీడియాలో ఏకంగా రంగస్దలాన్ని పాడు చేయద్దని, సేవ్ రంగస్దలం అన్నట్లుగా పోస్ట్ లు పెడుతున్నారు. రైట్స్ తీసుకున్న తర్వాత వాళ్లకు తోచినట్లు మార్పులు చేస్తారు. ఖచ్చితంగా తమిళ  రూరల్ నేటివిటికి తగ్గట్లుగా స్క్రిప్టు మార్చి, మరిన్ని మాస్ ఎలిమెంట్స్ కలిపి, లారెన్స్ బాడీ లాంగ్వేజ్ కు తగినట్లు గా సీన్స్ మారుస్తారు ఈ సినిమాని తమిళ్ ఇండస్ట్రీలో విడుదల చేసి..మళ్లీ అదే సినిమాని తెలుగులో కూడా విడుదల కూడా చేయవచ్చు. దీంతో మెగా అభిమానులు రంగస్థలం సినిమా పాడు చేయవద్దు సేవ్ రంగస్థలం అంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: