అనుష్క లీడ్ రోల్ లో "నిశ్శబ్దం" అనే లేడి ఓరియంటెడ్ మువీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క ఓ ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలోని అనుష్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసి చాలా రోజులు అవుతుంది. ఈ సినిమాలో అనుష్కతో పాటు గీతాంజలి ఫేమ్ అంజలి కూడా నటిస్తుంది. అంతే కాదు ఆర్ మాధవన్, మరియు షాలినీ పాండే కూడా ఉన్నారు. 


తెలుగు తమిళ, మళయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిహేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ప్రీ టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంజలి లుక్ ని రివీల్ చేసింది చిత్ర బృందం. పోస్టర్ లో అంజలి వెరీ స్టైలీష్ లుక్ లో చేతిలో గన్ తో సీరియస్ మూడ్ లో కనిపిస్తోంది. అంజలి లుక్ చూస్తుంటే.. సినిమాలో ఆమె క్యారెక్టర్ కీలకమైనదని అనిపిస్తోంది. 


అమెరికా సియోటెల్ బ్యాక్ డ్రాప్ పోలీస్ అధికారిగా  పోలీస్ గెటప్ లో చాలా స్టైలిష్ గా ఉంది. గెటప్ కి తగ్గట్టే షార్ట్ హెయిర్ కట్ తో బబ్లీగానూ కనిపిస్తోంది. ఈ చిత్రంలో అంజలి  క్రైమ్ డిటెక్టివ్ పాత్ర చేస్తుందట. ఈ క్రైమ్ డిటెక్టివ్ పాత్ర పేరు "మహా". రచయిత కోన వెంకట్ తన బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క మూగ బధిరురాలిగా నటిస్తుందట. ఇక ఈ సినిమాలో సప్సెన్స్ ఎలిమెంట్స్ చాల బాగా వచ్చాయని సమాచారం. ఈ ఎలిమెంట్స్  సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట. 


ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ అండ్ ట్విస్ట్ లు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపిస్తే, ఇక మాధవన్ ఈ సినిమాలో సెల్లో ప్లేయర్ గా నటిస్తున్నాడు. ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. లేడి ఓరియంటెడ్ చిత్రాలు అనుష్కకి మంచి పేరును తీసుకొచ్చాయి. మరి ఈ చిత్రం కూడా అలానే విజయం సాధించాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: