టీడీపీ అధినేత‌, ఏపీ విప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు ఇప్ప‌టికే నాయ‌కుల జంపింగుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతు న్నారు. ఇంత‌లోనే ఉరుములేని పిడుగు మాదిరిగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ పార్టీకి, ప‌ద‌వికి కూడా రాజీనా మా చేశారు. ఒక‌ప‌క్క‌, వైసీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతూ.. పార్టీ హ‌వాను పెంచేందుకు బాబు శ‌త విధాల ప్ర‌య‌త్నాలు చేస్తున్న స‌మ‌యంలోనే ఇలా నాయ‌కులు జంప్ చేయ‌డంతో ఆయ‌నకు తీవ్ర ఇబ్బంది క‌ర ప‌రాణామాలు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఇసుక కుంభ‌కోణంపై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జమెత్తుతు న్నారు. ఇలా అటు పార్టీ త‌ర‌ఫున ఇబ్బంది ప‌డుతూ.. ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తూ.. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌పై దుమ్మెత్తిపోస్తున్న చంద్ర‌బాబుకు తాజాగా మ‌రో భారీ షాక్ త‌గిలింది.


విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని.. తాజాగా గురువారం వైసీపీ పాల‌న‌ను, జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను ఆయ‌న ఆకాశానికి ఎత్తేశారు. ఒక‌ప‌క్క టీడీపీ అధినేత జ‌గ‌న్‌పైనా, ప్ర‌భుత్వంపైనా తీవ్ర‌స్థాయిలో విజృంభించి మ‌రీ పోరాటం చేస్తుంటే.. నానీ ఇప్పుడు ఇలా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని వేనోళ్ల కొనియాడ‌డంతో చంద్ర‌బాబుపై పొలిటిక‌ల్‌గా పిడుగు ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తూ.. కేబినెట్‌లో తీర్మానం చేసింది. దీనిపై నాని స్పందించారు. సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ కేశినేని నాని స్వాగతించారు.


ఆయన గురువారం విజ‌య‌వాడ‌లో రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పేర్ని నానితో కలిసి మీడి యాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ముఖ్యమంత్రి జగన్‌ సక్సెస్‌ అయ్యారని అభినందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ఆర్టీసీని కాపాడటాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందన్నారు. లాభాలు వచ్చే మార్గాల్లో ప్రయివేట్‌ బస్సులు నడుపుతారని, నష్టాలు వచ్చే మార్గంలో ప్రయివేట్‌ ఆపరేటర్లు బస్సులు నడపరని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని కేశినేని నాని అన్నారు.


అంతేకాదు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్న కాన్సెప్ట్‌ చాలా గొప్పదన్నారు. మంచిపని చేశారని తనకు అనిపించింది కాబట్టే చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. నాని చేసిన వ్యాఖ్య‌ల్లో నిజం ఉన్నా ప్ర‌తిప‌క్షానికి చెందిన ఎంపీ కావ‌డంతో టీడీపీలో తీవ్ర గంద‌ర‌గోళం, అదేస‌మ‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న చోటు చేసుకుంది. ఒక ప‌క్క‌తాము ప్ర‌భుత్వంపై పోరాడుతుంటే.. మ‌రోప‌క్క ఎంపీలు ఇలా వ్యాఖ్యానించ‌డంతో చంద్ర‌బాబుకు దిక్కుతోచ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: