బుల్లితెర  యాంకర్  మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. యాంకరింగ్ లో తనదైన స్టైల్ లో అందరిని అలరించే వాడు. ఇక ప్రదీప్ యాంకరింగ్ చూడడానికి షోని  చూసే వారు చాలా మందే  ఉన్నారు. ఇక బుల్లితెర యాంకర్ ప్రదీప్  ఫాలోయింగ్ కూడా తక్కువ లేదు... హీరోల రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు ప్రదీప్. ప్రదీప్ యాంకరింగ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎలాంటి వల్గారిటీ లేకుండా చేసే యాంకరింగ్. ఎవరినీ నొప్పించకుండా ఎవరిని బాధపెట్టకుండా ఎలాంటి బాడ్ వర్డ్స్ వాడకుండా ప్రదీప్ యాంకరింగ్ తో...  అందరిని మెస్మరైజ్ చేస్తాడు . రేడియో జాకీ నుంచి తెలుగు బుల్లితెర నెంబర్వన్ యాంకర్  వరకు ఎదిగాడు  ప్రదీప్  మాచిరాజు . ఇక ఈ టీవీలో ప్రసారమయ్యే డీ షో నుంచి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ప్రదీప్. 



 ఢీ  షోలో  ప్రదీప్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు.... ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షోలో  సుధీర్ రష్మి కామెడీ రొమాన్స్ కి ఎంత క్రేజ్ ఉందొ...  వీళ్లిద్దరి మధ్య కన్వర్జేషన్ లో ప్రదీప్ వేసే  ఆటో పంచ్ లకు  కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే అలాంటి ప్రదీప్ ఇప్పుడు బుల్లితెరలో ఎక్కడా కనిపించడం లేదు. గత రెండు సంవత్సరాల నుంచి యాంకరింగ్ చేస్తున్న ఢీ షోలో  కూడా టీం లీడర్ లుగా ఉన్న సుధీర్ రష్మి యాంకరింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీ జోడి లో ప్రదీప్ మాయం అయ్యే సరికి అందరూ షాక్ తిన్నారు. 



 అయితే ప్రదీప్ ఢీ షో  నుంచి తప్పుకోవడానికి పారితోషికం కారణమంటూ చాలా రోజులుగా పుకార్లు షికార్లు చేశాయి... ఇక ఆ తర్వాత బుల్లితెరపై ఎక్కడా కనిపించకపోవడంతో అనారోగ్యంతో ఉన్నారంటూ.. ఎదో  వ్యాధితో బాధపడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రదీప్ ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. బుల్లితెర ప్రేక్షకుల్లో ఎక్కడ చూసినా ప్రదీప్ కి ఏమైంది ఏమైపోయారు అనే చర్చ జరుగుతోంది. అయితే ప్రదీప్ పై వస్తున్న ఊహాగానాలపై ... ప్రదీప్ సన్నిహితులు స్పందించారు. ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు అని తెలిపారు. అయితే ఆ షూటింగ్ సమయంలో ప్రదీప్ కాలికి గాయం అయిన కారణంగా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని... అందువల్లే బుల్లితెరపై ఎక్కడా కనిపించడం లేదని ప్రదీప్ సన్నిహితులు తెలిపారు. మరో రెండు వారాల్లో ఆయన బుల్లితెరపై రి ఎంట్రీ  ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.  ప్రదీప్ ఆరోగ్యంపై ఆయన  సన్నిహితులు క్లారిటీ ఇవ్వటం తో... ప్రదీప్ పై వస్తున్న వార్తలు అన్నిటికీ పులిస్టాప్ పెట్టినట్లు అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: