రష్మి గౌతమ్... ఈ పేరు  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. తన అందచందాలతో అందర్నీ కట్టిపడేసే ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్ . జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరకు పరిచయమైన ఈ అమ్మడు ... హీరోయిన్లకు మించిన క్రేజ్ ను  సంపాదించుకుంది. ఇక జబర్దస్త్  కూడా టాప్ రేటింగ్  దూసుకుపోతుండటంతో ఈ అమ్మడు యాంకరింగ్ కి మరింత క్రెజ్  పెరిగిపోయింది. చురుకైన వ్యాఖ్యానంతో అదరగొట్టి వీక్షకులకు కట్టిపడేస్తుంది రష్మి గౌతమ్. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ  అలరిస్తుంది . ఇక అందాల ఆరబోతలో కూడా స్టార్ హీరోయిన్ లకు సైతం పోటీ పడుతూ ఉంటుంది రష్మి గౌతమ్. ఓ వైపు జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. రష్మి గౌతమ్ నటించిన గుంటూరు టాకీస్ సినిమా గురించి అయితే మాటల్లో చెప్పలేం. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు  చెమటలు పట్టించి  మతిపోగొట్టేసింది రష్మి గౌతమ్. 



 ఆ సినిమా కేవలం రష్మీ అందాలతోనే హిట్ అయింది అని చెప్పడం అతిశయోక్తి కాదు. తెలుగులో వరుస  సినిమాల్లో  ఛాన్స్ దక్కించుకుంటూనే...  జబర్దస్త్ యాంకర్ గా అదరగొడుతుంది  ఈ అమ్మడు. అయితే అటు సుడిగాలి సుధీర్ రష్మీ  జోడి  బుల్లితెరపై హిట్ పెయిర్ గా నిలుస్తుంది. వీరిద్దరూ ఏ స్టేజ్ మీద కనిపించిన సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా  మారిపోతారు. అయితే వీళ్లిద్దరి మధ్య ఏం లేదని వీరిద్దరు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించినప్పటికీ...నెటిజన్లు  మాత్రం వీళ్ల మధ్య ఏదో ఉంది అని అనుకుంటారు. ప్రస్తుతం రష్మీ కెరియర్  మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. ఇక రష్మి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా  ఉంటుంది... అభిమానులకి హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ అలరించడమే కాదు... అటు సామాజిక సమస్యలపై కూడా తనకు వీలున్నప్పుడల్లా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 



 ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మీ తాజాగా  మరో ట్విట్  పెట్టింది. ముంబైలో ఓ  ఇంటి పై నుంచి ఒక కుక్క  పిల్లను వేలాడదీశారని.... ఆ తర్వాత చుట్టుపక్కలవారు స్పందించడంతో ఆ కుక్కపిల్లను  రక్షించారని రష్మి గౌతమ్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చుట్టుపక్కల వారు వెంటనే ఫిర్యాదు చేయాలని... అంతేకాకుండా మూగజీవాల ప్రాణాల కోసం గల మెత్తలని  భావోద్వేగంగా రష్మి గౌతమ్ పోస్టు పెట్టింది. కాగా ప్రస్తుతం రష్మీ  పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కాగా ప్రస్తుతం రష్మి గౌతమ్ జబర్దస్త్ తో పాటు ఢీ  షోలో  కూడా యాంకరింగ్  చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: