రాబోయే డిసెంబర్ 20న విడుదల కాబోయే ‘రూలర్’ మూవీ విజయం బాలయ్య కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. అయితే కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి బాలయ్య అభిమానులలో కూడ పెద్దగా చెప్పుకోతగ్గ క్రేజ్ ఏర్పడక పోవడం ఒక విధంగా బాలయ్యకు మైనస్ పాయింట్ గా మారింది. 

దీనికితోడు ఈ మూవీ బాలయ్యకు సెంటిమెంట్ గా కలిసి వచ్చే సంక్రాంతి సీజన్ లో కాకుండా క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ కావడం బాలయ్య అభిమానులకు కూడ నిరాశను కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు లీక్ అయింది. 

ఈ మూవీలో బాలకృష్ణ పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఒక పాత్ర పారిశ్రామిక వేత్తగా కనిపిస్తే మరొక పాత్ర పోలీస్ లుక్ లో కనిపిస్తుందని తెలుస్తోంది. ఈ రెండు పాత్రలలో ఒక పాత్రకు మెమరీ లాస్ ఉండటంతో అక్కడక్కడ ఈ మూవీని చూసిన వారికి సూర్య సూపర్ హిట్ మూవీ ‘గజినీ’ గుర్తుకు వస్తుందని సమాచారం. 

ఇప్పుడు లీక్ అవుతున్న ఈ వార్తలు బాలయ్య అభిమానులను మరింత కలవర పెడుతున్నాయి. ‘గజినీ’ మూవీ తరహా స్క్రీన్ ప్లేతో ఇప్పటికే పదులు సంఖ్యలో సినిమాలు వచ్చాయి. ఇలాంటి కథలను చూడటం ప్రేక్షకులు ఎప్పుడో మానివేశారు. అలాంటి ఓల్డ్ స్క్రీన్ ప్లే టెక్నినిక్ ను ఇప్పుడు బాలకృష్ణ పై ప్రయోగిస్తే ఎవరు చూస్తారు అంటూ బాలయ్య అభిమానులు భయపడిపోతున్నారు. ఇప్పటికే ఈ మూవీలోని బాలయ్య పోలీసు లుక్ లో చెప్పుకోతగ్గ ఫైర్ కనిపించడం లేదు అని బాథ పడుతున్న బాలయ్య అభిమానులకు ఈ సినిమా కూడ కనీసపు హిట్ కాకపోతే బాలయ్య బోయపాటిల కాంబినేషన్ కు క్రేజ్ ఎలా ఏర్పడుతుంది అంటూ అంతర్మధనంలో ఉన్నట్లు వార్తల వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: